Telugu Global
Cinema & Entertainment

తెలుగు హీరోలంతా వేస్టుగాళ్లు:  తేజ‌

హోరాహోరీ సినిమా ఇచ్చిన అప‌జ‌య‌మో, త‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌న్న ప‌రాకులోనే ఏమో గానీ ద‌ర్శ‌కుడు తేజ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేసిన హీరోలకు ఎవ‌రికీ కృత‌జ్ఞ‌త లేద‌ని వారంతా వేస్టుగాళ్ల‌ని మండిప‌డ్డారు. దాదాపు 1000 మందిని ఇండ‌స్ర్టీకి తీసుకొచ్చినా.. 10 శాతం మంది కూడా త‌న ఫోన్లు లిఫ్టు చేయ‌డం లేద‌ని ఆదివారం ఓ టీవీ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వాపోయాడు. త‌న‌కు ట‌చ్‌లో లేనివారంతా ప‌చ్చి అవ‌కాశ‌వాదుల‌ని ధ్వ‌జ‌మెత్తాడు. త‌న […]

తెలుగు హీరోలంతా వేస్టుగాళ్లు:  తేజ‌
X
హోరాహోరీ సినిమా ఇచ్చిన అప‌జ‌య‌మో, త‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌న్న ప‌రాకులోనే ఏమో గానీ ద‌ర్శ‌కుడు తేజ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేసిన హీరోలకు ఎవ‌రికీ కృత‌జ్ఞ‌త లేద‌ని వారంతా వేస్టుగాళ్ల‌ని మండిప‌డ్డారు. దాదాపు 1000 మందిని ఇండ‌స్ర్టీకి తీసుకొచ్చినా.. 10 శాతం మంది కూడా త‌న ఫోన్లు లిఫ్టు చేయ‌డం లేద‌ని ఆదివారం ఓ టీవీ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వాపోయాడు. త‌న‌కు ట‌చ్‌లో లేనివారంతా ప‌చ్చి అవ‌కాశ‌వాదుల‌ని ధ్వ‌జ‌మెత్తాడు. త‌న దృష్టిలో వారంతా.. చ‌నిపోయిన ఉద‌య్‌కిర‌ణ్‌తో స‌మాన‌మ‌ని పోల్చాడు. న‌వ‌దీప్‌, రీమాసేన్‌, స‌దాఫ్‌, కాజ‌ల్‌, సుమ‌న్‌శెట్టి లాంటి కొంద‌రు న‌టులు త‌ప్ప 90 శాతం మందికి త‌నంటే గౌర‌వం లేద‌ని, వారంద‌రికీ క‌ళ్లు నెత్తికెక్కాయ‌ని విమ‌ర్శించారు. గ‌తిలేని వారికి లైఫ్ ఇస్తే.. వారంతా ఇప్పుడు కోటీశ్వ‌రులై జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో బంగళాలు క‌ట్టుకుని క‌ళ్లు నెత్తికెక్కించుకున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను ఆర్టిస్టుల‌ను కొడ‌తాన‌న్న విష‌య‌మే ఎందుకు అడుగుతార‌ని యాంక‌ర్‌పైనా ఎదురుదాడి చేశారు. వారంతా కోటీశ్వ‌రులైతే దానికి మీరే కార‌ణ‌మ‌ని ఎందుకు అడగ‌రు? అని తేజ ప్ర‌శ్నించ‌డంతో యాంక‌ర్ నోట మాట రాలేదు. తెలుగు ఇండ‌స్ర్టీ అంటేనే విశ్వాసం లేనిద‌ని తేల్చేశాడు. స‌ల్మాన్‌ఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్‌కు ఉన్న కృత‌జ్ఞ‌తాభావం తెలుగున‌టుల‌కు లేద‌న్నాడు. మొత్తానికి తేజ నిజాలు చెప్పాడ‌ని కొంద‌రు, కాద‌ని మ‌రికొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
First Published:  13 Sep 2015 7:00 PM GMT
Next Story