Telugu Global
Others

ఏపికి వ్యాపార అనుకూల రాష్ట్రంగా గుర్తింపు

తాజాగా దేశంలో ఏయే రాష్ట్రాలు వాణిజ్యానికి అనుకూలంగా ఉన్నాయో వివరిస్తూ ప్రపంచ బ్యాంక్ సహకారంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో దేశంలో వ్యాపారానికి అనుకూలంగా ఉన్న రాష్ర్టాల్లో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో నిలిచింది. గుజరాత్ రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలవగా… మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది. తొలి అయిదు స్థానాల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ […]

ఏపికి వ్యాపార అనుకూల రాష్ట్రంగా గుర్తింపు
X
తాజాగా దేశంలో ఏయే రాష్ట్రాలు వాణిజ్యానికి అనుకూలంగా ఉన్నాయో వివరిస్తూ ప్రపంచ బ్యాంక్ సహకారంతో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో దేశంలో వ్యాపారానికి అనుకూలంగా ఉన్న రాష్ర్టాల్లో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో నిలిచింది. గుజరాత్ రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలవగా… మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది. తొలి అయిదు స్థానాల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి. ఈ జాబితాలో అరుణాచల్ ప్రదేశ్ చివరి స్థానంలో నిలిచింది.
వ్యాపార అనుకూల రాష్ట్రాల జాబితా వరుసగా.!
గుజరాత్ – 1 ఆంధ్రప్రదేశ్ – 2 జార్ఖండ్ – 3 చత్తీస్గఢ్ – 4 మధ్యప్రదేశ్ – 5 రాజస్థాన్ – 6 ఒడిశా – 7 మహారాష్ట్ర – 8 కర్నాటక – 9 ఉత్తర ప్రదేశ్ – 10 పశ్చిమ బెంగాల్ – 11 తమిళనాడు – 12 తెలంగాణ – 13 హర్యానా – 14 ఢిల్లీ – 15 పంజాబ్ – 16 హిమాచల్ ప్రదేశ్ – 17 కేరళ – 18 గోవా – 19 పుదుచ్చేరి – 20 బీహార్ – 21 అసోం – 22 ఉత్తరాఖండ్ – 23 చండీగఢ్ – 24 అండమాన్ నికోబర్ దీవులు – 25 త్రిపుర – 26 సిక్కిం – 27 మిజోరాం – 28 జమ్ము కాశ్మీర్ – 29 మేఘాలయ – 30 నాగాలాండ్ 31 అరుణాల్ ప్రదేశ్ – 32
ప్రపంచ బ్యాంకు నివేదికపై చంద్రబాబు హర్షం
వ్యాపార అనుకూల రాష్ట్రాల జాబితాలో ప్రపంచ బ్యాంకు ఏపీకి రెండో ర్యాంకు ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడలో ఉన్న ఆయన ప్రపంచ బ్యాంకు జాబితాలో ఏపీకి ద్వితీయ స్థానం దక్కడంపై స్పందిస్తూ ప్రభుత్వం, అధికారుల సమన్వయ కృషి వల్లే ఈ అవకాశం లభించిందని తెలిపారు. అందరూ కలిసి సమన్వయంతో కృషి చేస్తే ప్రపంచలోనే ఏపీ నెంబర్‌ వన్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
First Published:  14 Sep 2015 8:00 PM GMT
Next Story