Telugu Global
Cinema & Entertainment

యూరోప్ చుట్టి వచ్చిన డిక్టేటర్

తన 99వ సినిమాగా డిక్టేటర్ ను తెరకెక్కిస్తున్నాడు బాలయ్య. ఏకథాటిగా ఈ సినిమాను కంప్లీట్ చేసి, వీలైనంత తొందరగా వందో సినిమాను ఎనౌన్స్ చేయాలనుకుంటున్నాడు. అందుకే డిక్టేటర్ మూవీని పరుగులు పెట్టిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి యూరోప్ షెడ్యూల్ కూడా పూర్తయింది. ఐరోపాలోని పోలెండ్, బల్గేరియాల్లో ఈ సినిమాకు సంబంధించి కొన్ని సాంగ్స్ పిక్చరైజ్ చేశారు. హీరోయిన్ అంజలి, హీరో బాలయ్యతో ఈ పాటల చిత్రీకరణ పూర్తిచేసి హైదరాబాద్ తిరిగొచ్చింది డిక్టేటర్ టీం. సినిమా ఫస్ట్ […]

యూరోప్ చుట్టి వచ్చిన డిక్టేటర్
X
తన 99వ సినిమాగా డిక్టేటర్ ను తెరకెక్కిస్తున్నాడు బాలయ్య. ఏకథాటిగా ఈ సినిమాను కంప్లీట్ చేసి, వీలైనంత తొందరగా వందో సినిమాను ఎనౌన్స్ చేయాలనుకుంటున్నాడు. అందుకే డిక్టేటర్ మూవీని పరుగులు పెట్టిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి యూరోప్ షెడ్యూల్ కూడా పూర్తయింది. ఐరోపాలోని పోలెండ్, బల్గేరియాల్లో ఈ సినిమాకు సంబంధించి కొన్ని సాంగ్స్ పిక్చరైజ్ చేశారు. హీరోయిన్ అంజలి, హీరో బాలయ్యతో ఈ పాటల చిత్రీకరణ పూర్తిచేసి హైదరాబాద్ తిరిగొచ్చింది డిక్టేటర్ టీం. సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్, టీజర్ ను మరో 2 రోజుల్లో విడుదల చేయబోతున్నారు. వినాయక చవితి కానుకగా డిక్టేటర్ ఫస్ట్ లుక్ విడుదలవుతుంది. ఫస్ట్ లుక్ విడుదలైన వెంటనే.. హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ప్రారంభమౌతుంది. శ్రీవాస్ దర్శకత్వంలో ఎరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయాలని భావిస్తున్నారు.
First Published:  14 Sep 2015 7:00 PM GMT
Next Story