పీకు రీమేక్ లో వెంకీ..!

త‌న‌కు యాప్ట్ అవుతాయ‌నుకుంటే..వెంకటేష్  వెంట‌నే ఆ సినిమా ఏ లాంగ్వేజ్ లో వున్న రైట్స్ ద‌క్కించుకుని తెలుగులో చేస్తారు. ఆ మ‌ధ్య  మ‌ల‌యాళ దృశ్యం చిత్రం అలా చేసిందే.  ఆఫ్ కోర్స్ వెంక‌టేష్ కెరీర్ లో    రీమేక్స్  చాల వున్నాయి. క‌ట్ చేస్తే..తాజాగా   అమితాబ్,  దీపిక ప‌దుకోణ్, ఇర్ఫాన్ ఖాన్ లీడ్ రోల్స్ లో  వ‌చ్చి  యావ‌రేజ్  విజ‌యం సాధించిన  హింది చిత్రాన్ని  సురేష్ బాబు   రీమేక్ హ‌క్కులు ద‌క్కించుకున్నార‌ట‌.     దీంతో వెంకీ  ఈ సినిమాలో  లీడ్ రోల్ చేయ‌డానికి  సిద్ద ప‌డిన‌ట్లేన‌ని  తెలుస్తుంది. ఒక స్టార్ హీరో కూతురు వెంకీ డాట‌ర్ గా  కూడా క‌నిపిస్తార‌నే టాక్ వినిప‌స్తుంది.  త‌న వ‌య‌సుకు త‌గ్గ రోల్స్ ఎంచుకుని..   అభిమానుల్ని మెప్పించే  ట్రాక్ లో వున్నారట వెంకీ ..పీకు తో  మ‌రో మంచి సినిమా మ‌న‌కు ఇస్తార‌న‌డంలో  డౌట్ లేద‌న‌డం అతిశ‌యోక్తి కాదు మ‌రి.!