Telugu Global
National

బీజేపీ తొలి జాబితాలో 50 శాతం మంది మహిళలే

బీహార్‌లో కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుపై బీజేపీ కన్నేసింది. ముఖ్యంగా ఎస్టీలు, బీసీలను తమ ఓటు బ్యాంకులో చేర్చుకుని లబ్ది పొందాలని భావిస్తోంది. మహిళలను కూడా ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. 160 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ 43 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో 26 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు మళ్ళీ టిక్కెట్లిచ్చింది. మిగిలిన 24 సీట్లను మహిళలకు, ఎస్టీ, బీసీలకు కేటాయించింది. అమిత్‌ షా, నరేంద్రమోడిసహా పలువురు అగ్రనేతలు పాల్గొన్న సమావేశంలో ఈ […]

బీజేపీ తొలి జాబితాలో 50 శాతం మంది మహిళలే
X
బీహార్‌లో కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుపై బీజేపీ కన్నేసింది. ముఖ్యంగా ఎస్టీలు, బీసీలను తమ ఓటు బ్యాంకులో చేర్చుకుని లబ్ది పొందాలని భావిస్తోంది. మహిళలను కూడా ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. 160 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ 43 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో 26 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు మళ్ళీ టిక్కెట్లిచ్చింది. మిగిలిన 24 సీట్లను మహిళలకు, ఎస్టీ, బీసీలకు కేటాయించింది. అమిత్‌ షా, నరేంద్రమోడిసహా పలువురు అగ్రనేతలు పాల్గొన్న సమావేశంలో ఈ జాబితా ఖరారు చేసింది. ముగ్గురు సిట్టింగ్‌లకు మొండి చేయి చూపి అక్కడ కొత్తవారిని మోహరించింది. ప్రకటిత జాబితాలో 19 మంది తొలిదశ ఎన్నికలు జరిగే నియోజక వర్గాల అభ్యర్థులు కాగా 15 మంది రెండో దశ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు. 14 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థుల్లో 50 శాతం మంది మహిళలు, యువకులే. 60 శాతం మంది బీసీ, ఎస్సీ వర్గానికి చెందినవారు కావడం విశేషం. ప్రత్యర్థి వర్గం జేడీయూ, ఆర్జేడీని నిర్వీర్యం చేసే దిశగా ఎక్కువ మంది బీసీలకు అవకాశం కల్పించినట్లు భావిస్తున్నారు. లాలూ యాదవ్‌ను ఇరకాటంలో పెట్టడానికన్నట్టు యాదవ సామాజిక వర్గానికి చెందిన ఐదుగురికి టికెట్లు ఇచ్చింది. మొదటి నుంచి బీజేపీని సమర్థిస్తూ వచ్చిన బ్రాహ్మణ, భూమియార్‌, రాజ్‌పూట్‌ వర్గాలకు కూడా తొలి జాబితాలో ప్రాధాన్యం దక్కింది.
First Published:  16 Sep 2015 4:07 AM GMT
Next Story