Telugu Global
NEWS

కేసీఆర్ గెలవలేడా?

తెలంగాణ ముఖ్యమంత్రి పాలనపై మాజీమంత్రి కోమటిరెడ్డి విరుచుకుపడ్డారు. నల్లగొండలో జరిగిన సమావేశంలో ఆయన కేసీఆర్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ నిలబెట్టుకోలేకపోయాడని ఆరోపించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే.. రాష్ర్టంలో ఇద్దరే వ్యక్తులు తిరిగి టీఆర్ ఎస్ నుంచి గెలుస్తారని జోస్యం చెప్పారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరంటే.. నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు, ఆర్థిక మంత్రి ఈటెలరాజేందర్ అని సెలవిచ్చారు. అంటే పరోక్షంగా సీఎం కూడా విజయం సాధించలేరని టీఆర్ ఎస్ ప్రభుత్వానికి […]

కేసీఆర్ గెలవలేడా?
X
తెలంగాణ ముఖ్యమంత్రి పాలనపై మాజీమంత్రి కోమటిరెడ్డి విరుచుకుపడ్డారు. నల్లగొండలో జరిగిన సమావేశంలో ఆయన కేసీఆర్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ నిలబెట్టుకోలేకపోయాడని ఆరోపించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే.. రాష్ర్టంలో ఇద్దరే వ్యక్తులు తిరిగి టీఆర్ ఎస్ నుంచి గెలుస్తారని జోస్యం చెప్పారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరంటే.. నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు, ఆర్థిక మంత్రి ఈటెలరాజేందర్ అని సెలవిచ్చారు. అంటే పరోక్షంగా సీఎం కూడా విజయం సాధించలేరని టీఆర్ ఎస్ ప్రభుత్వానికి చురకలంటించారు. మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవలేరని తేల్చిపారేశారు. దీనిపై టీఆర్ ఎస్ నాయకులు మండిపడుతున్నారు. కోమటిరెడ్డి గతం మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. 2009 నుంచి ఇటీవలి మెదక్ పార్లమెంటు స్థానం దాకా టీఆర్ ఎస్ తాను రాజీనామా చేసిన అన్ని స్థానాలను గెలుచుకున్న విషయం ఆయన మర్చిపోయారని ఎగతాళి చేస్తున్నారు.
First Published:  15 Sep 2015 8:28 PM GMT
Next Story