Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 207

సినిమా ధియేటర్లో లావుటతను ఉన్నాడు. అతని వెనక సీట్లో చిన్ని కుర్రాడు కూర్చున్నాడు. లావుటతను వెనక్కి తిరిగి “బాబూ! నీకేమీ కనిపించడం లేదా” అన్నాడు. “అవునంకుల్‌! నాకేమీ కనిపించడం లేదు. కామెడీ సీను కనిపిస్తే నేనెలా నవ్వాలి?” అన్నాడు. “ఫర్లేదు బాబూ! కామెడీ వచ్చినప్పుడల్లా నేను కదుల్తాను. నేను కదిల్నప్పుడల్లా నువ్వు నవ్వు” అని సర్దిచెప్పాడు! ————————————————————————————————— కొత్తగా పనిలో చేరినతను మొదటిరోజు తోటివాళ్ళతో లంచ్‌ చెయ్యడానికి కూర్చున్నాడు. అందరూ ఎవరి కారియర్లు వాళ్ళు తెరిచారు. కొత్తగా […]

సినిమా ధియేటర్లో లావుటతను ఉన్నాడు. అతని వెనక సీట్లో చిన్ని కుర్రాడు కూర్చున్నాడు. లావుటతను వెనక్కి తిరిగి “బాబూ! నీకేమీ కనిపించడం లేదా” అన్నాడు.
“అవునంకుల్‌! నాకేమీ కనిపించడం లేదు. కామెడీ సీను కనిపిస్తే నేనెలా నవ్వాలి?” అన్నాడు.
“ఫర్లేదు బాబూ! కామెడీ వచ్చినప్పుడల్లా నేను కదుల్తాను. నేను కదిల్నప్పుడల్లా నువ్వు నవ్వు” అని సర్దిచెప్పాడు!
—————————————————————————————————
కొత్తగా పనిలో చేరినతను మొదటిరోజు తోటివాళ్ళతో లంచ్‌ చెయ్యడానికి కూర్చున్నాడు. అందరూ ఎవరి కారియర్లు వాళ్ళు తెరిచారు. కొత్తగా చేరినతను తన టిఫిన్‌ బాక్స్‌ విప్పాడు.
పైన ఉన్న చపాతీ తీసి పక్కన పెట్టాడు. అతని ముఖంలో విసుగు కనిపించింది.
రెండో చపాతీ తీశాడు. ముఖం వాడింది. కింద ఏమైనా ఉందని మూడో చపాతీ తీశాడు.
ఇదంతా చూస్తున్న పక్కన కూర్చున్న అతను “ఇంత బాధపడకపోతే నీకు నచ్చింది చేసివ్వమని మీ ఆవిడతో చెప్పరాదా?” అన్నాడు.
కొత్తగా చేరినతను పక్కనున్న వ్యక్తిని చూసి “బాబూ! నాకింకా పెళ్ళికాలేదు. ఇవి నేను చేసిన చపాతీలే” అన్నాడు.

First Published:  16 Sep 2015 5:03 AM GMT
Next Story