Telugu Global
Cinema & Entertainment

ప‌వ‌న్  , ఎన్టీఆర్ నో...స‌ల్మాన్  ఎస్..!

విజయ్ హీరోగా మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన ‘కత్తి’ చిత్రం తెలుగులో రీమేక్ అవుతుందని చాలా కాలాంగా ఊరిస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఈ చిత్రం చూసి రీమేక్ కు ఒప్పుకోలేదని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు వెర్షన్ విషయమై కాపీ రైట్ కేసు ఉండటంతో ఆగిపోయిందని వినికిడి. అయితే ఇప్పుడు ఈ చిత్రం హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కబోతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే… సౌత్ సినిమా రీమేక్‌ల్లో నటించడానికి ఆసక్తి కనబరుచే సల్మాన్‌ ఈ […]

ప‌వ‌న్  , ఎన్టీఆర్ నో...స‌ల్మాన్  ఎస్..!
X

విజయ్ హీరోగా మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన ‘కత్తి’ చిత్రం తెలుగులో రీమేక్ అవుతుందని చాలా కాలాంగా ఊరిస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఈ చిత్రం చూసి రీమేక్ కు ఒప్పుకోలేదని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు వెర్షన్ విషయమై కాపీ రైట్ కేసు ఉండటంతో ఆగిపోయిందని వినికిడి. అయితే ఇప్పుడు ఈ చిత్రం హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కబోతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే… సౌత్ సినిమా రీమేక్‌ల్లో నటించడానికి ఆసక్తి కనబరుచే సల్మాన్‌ ఈ చిత్రం రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్‌ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్‌ నటించబోతున్నాడు అనే మాట కొంత కాలంగా వినిపిస్తుంది. తాజాగా మురుగదాస్‌ ‘కత్తి’ హిందీ రీమేక్‌లో నటించడానికి సల్లూభాయ్‌ పచ్చ జెండా వూపేశాడని సమాచారం. ”మురుగదాస్‌ చెప్పిన కథ సల్మాన్‌కు బాగా నచ్చినా ఆయన కోర్టు కేసుల్లో ఉండటంతో అప్పట్లో ఓకే చెప్పలేదు. అతుల్ అగ్నిహోత్రి క‌త్తీ సినిమాను హిందిలో నిర్మిస్తార‌ని తెలుస్తుంది.

First Published:  16 Sep 2015 12:00 AM GMT
Next Story