Telugu Global
Others

తెలంగాణ ప్రజల దాహార్తి తీర్చడమే లక్ష్యం: కేటీఆర్

తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వాటర్‌గ్రిడ్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. అయితే వాటర్‌గ్రిడ్ పథకాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం నాగసాల వద్ద వాటర్‌గ్రిడ్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాలమూరు ప్రజల దాహార్తిని తీర్చడానికి వాటర్‌గ్రిడ్‌కు శంకుస్థాపన చేశామని తెలిపారు. లక్షల మంది వలసలు పోతుంటే గత పాలకులు ఏం చేశారని […]

తెలంగాణ ప్రజల దాహార్తి తీర్చడమే లక్ష్యం: కేటీఆర్
X
తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వాటర్‌గ్రిడ్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. అయితే వాటర్‌గ్రిడ్ పథకాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం నాగసాల వద్ద వాటర్‌గ్రిడ్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాలమూరు ప్రజల దాహార్తిని తీర్చడానికి వాటర్‌గ్రిడ్‌కు శంకుస్థాపన చేశామని తెలిపారు. లక్షల మంది వలసలు పోతుంటే గత పాలకులు ఏం చేశారని ప్రశ్నించారు. గతంలో సీఎంలు ఈ జిల్లాను దత్తత తీసుకున్నా జిల్లా రాత మారలేదన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని స్పష్టం చేశారు. టీడీపీ, కాంగ్రెస్ ఆరోపణలు పట్టించుకోమని తేల్చి చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని ఉద్ఘాటించారు. వాటర్‌గ్రిడ్ పథకంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రాబోయే రెండేళ్లలోనే పాలమూరు జిల్లాలోని ప్రతి ఇంటికి మంచి నీరు అందిస్తామని తెలిపారు. ఎన్నికల ముందు మంత్రులు అరచేతిలో వైకుంఠం చూపించారని గుర్తు చేశారు. హామీలు నెరవేర్చకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన దమ్మున్న సీఎం దేశంలో కేసీఆర్ ఒక్కరే అని తెలిపారు. సీఎం కేసీఆర్ ఓట్ల కోసం మాయ మాటలు చెప్పే వ్యక్తి కాదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా పని చేస్తుందని చెప్పారు.
First Published:  16 Sep 2015 4:19 AM GMT
Next Story