Telugu Global
Cinema & Entertainment

బుల్లితెరపైకి బ్యాడ్మింటన్ క్వీన్

బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ త్వరలోనే ముఖానికి రంగేసుకోబోతోంది. ఇప్పటికే పలు వాణిజ్య ప్రకటనల్లో నటించిన ఈ స్టార్ క్రీడాకారిణి ఫస్ట్ టైమ్ ఓ హిందీ సీరియల్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హర్ ఘర్ కుచ్ కెహ్ తా హై పేరుతో త్వరలోనే రాబోతున్న హిందీ సీరియల్ లో సైనా నెహ్వాల్ కనిపించనుంది. పాపులర్ కామెడీ స్టార్ దిలీప్ పాథక్ ఇందులో కీరోల్ పోషించనున్నాడు. అయితే సైనా ప్రత్యేకంగా ఈ సీరియల్ లోనే నటించడానికి […]

బుల్లితెరపైకి బ్యాడ్మింటన్ క్వీన్
X
బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ త్వరలోనే ముఖానికి రంగేసుకోబోతోంది. ఇప్పటికే పలు వాణిజ్య ప్రకటనల్లో నటించిన ఈ స్టార్ క్రీడాకారిణి ఫస్ట్ టైమ్ ఓ హిందీ సీరియల్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హర్ ఘర్ కుచ్ కెహ్ తా హై పేరుతో త్వరలోనే రాబోతున్న హిందీ సీరియల్ లో సైనా నెహ్వాల్ కనిపించనుంది. పాపులర్ కామెడీ స్టార్ దిలీప్ పాథక్ ఇందులో కీరోల్ పోషించనున్నాడు. అయితే సైనా ప్రత్యేకంగా ఈ సీరియల్ లోనే నటించడానికి ఎందుకు ఒప్పుకుందనే విషయం మాత్రం అస్పష్టంగా ఉంది. కేవలం సీరియల్ ప్రమోషన్ కోసమే.. కొంత పారితోషకం తీసుకొని, సింగిల్ ఎపిసోడ్ లో నటించడానికి సైనా ఒప్పుకున్నట్టు సమాచారం. గతంలో చాలామంది హీరోయిన్లు, నటులు ఇలానే చేశారు. తమ సినిమాల ప్రమోషన్ కోసమో.. సీరియల్ ఇమేజ్ పెంచడం కోసమో ఓ ఎపిసోడ్ లో అలా మెరిసేవారు. ఇప్పుడు సైనా కూడా అదే పని చేస్తోందంటున్నారు విశ్లేషకులు.
First Published:  15 Sep 2015 8:00 PM GMT
Next Story