Telugu Global
Others

తూర్పులో వ‌రుస విషాదాల వెనుక‌?

ఎటు చూసినా ప్ర‌శాంత వాతావ‌ర‌ణం. ప్ర‌కృతి సైతం అసూయ ప‌డేంత ప‌చ్చ‌ద‌నం. పిల్ల‌కాలువలు, ఏటి గ‌ట్లు, కొబ్బ‌రితోట‌లు ఇది తూర్పుగోదావ‌రి జిల్లా ముఖ‌చిత్రం. పాడిపంట‌లు, ఆక్వా ప‌రిశ్ర‌మ‌, స్వ‌గృహ ఫుడ్స్‌, ఉద్యాన‌వ‌న పంట‌ల‌తో దేశంలోనే ప్ర‌ముఖ ప్రాంతంగా పేరుగాంచిన తూర్పుగోదావ‌రి జిల్లాలో ఇటీవ‌ల కాలంలో వ‌రుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మాన‌వ‌త‌ప్పిద‌మా? ప‌్ర‌మాదమా? నిర్ల‌క్ష్య‌మా?  అనేది ప‌క్క‌న‌బెడితే.. మూడు సంఘ‌ట‌న‌ల్లో క‌లిపి డెబ్బ‌యి మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిపై ఆధార‌ప‌డిన కుటుంబాలు రోడ్డున‌ప‌డ్డాయి. నిన్నఫ్లైయాష్ లారీ తిర‌గ‌బ‌డిన […]

తూర్పులో వ‌రుస విషాదాల వెనుక‌?
X

ఎటు చూసినా ప్ర‌శాంత వాతావ‌ర‌ణం. ప్ర‌కృతి సైతం అసూయ ప‌డేంత ప‌చ్చ‌ద‌నం. పిల్ల‌కాలువలు, ఏటి గ‌ట్లు, కొబ్బ‌రితోట‌లు ఇది తూర్పుగోదావ‌రి జిల్లా ముఖ‌చిత్రం. పాడిపంట‌లు, ఆక్వా ప‌రిశ్ర‌మ‌, స్వ‌గృహ ఫుడ్స్‌, ఉద్యాన‌వ‌న పంట‌ల‌తో దేశంలోనే ప్ర‌ముఖ ప్రాంతంగా పేరుగాంచిన తూర్పుగోదావ‌రి జిల్లాలో ఇటీవ‌ల కాలంలో వ‌రుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మాన‌వ‌త‌ప్పిద‌మా? ప‌్ర‌మాదమా? నిర్ల‌క్ష్య‌మా? అనేది ప‌క్క‌న‌బెడితే.. మూడు సంఘ‌ట‌న‌ల్లో క‌లిపి డెబ్బ‌యి మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిపై ఆధార‌ప‌డిన కుటుంబాలు రోడ్డున‌ప‌డ్డాయి. నిన్నఫ్లైయాష్ లారీ తిర‌గ‌బ‌డిన ఘ‌ట‌న‌లో 18 మంది చ‌నిపోతే.. అంతకుముందు పుష్క‌రాల ప్రారంభం రోజున జ‌రిగిన తొక్కిస‌లాట‌లో 30 మంది మృతి చెందారు. పుష్క‌రాల కంటే ముందు గోదావ‌రిలో తుఫాన్ వాహ‌నం తిరగ‌బ‌డ‌డంతో 22 మంది ప్రాణాలు విడిచారు. ఈ మూడు విషాదక‌ర సంఘ‌ట‌న‌ల వెనుక ఎన్నో కార‌ణాలున్నాయి. కానీ మూడు ఘ‌ట‌న‌లు తూర్పుగోదావరి జిల్లాలోనే జ‌రిగాయి.

పుష్క‌రాల‌కు ముందే మ‌ర‌ణ మృదంగం
జూన్ 12వ తేదీ తెల్ల‌వారేస‌రికి ఒకే కుటుంబానికి చెందిన 22 మంది విగ‌త‌జీవుల‌య్యారు. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం మూసాయిపేటకు చెందిన ఈగల అప్పారావు తన కుటుంబసభ్యులు, సమీప బంధువులు, వారి పిల్లలతో సహా మొత్తం 23 మంది తీర్థయాత్రల కోసం సొంత తుఫాను వాహనంలో తిరుపతి బయలుదేరారు. తీర్థ‌యాత్ర‌లు ముగించుకుని వ‌స్తుండ‌గా గోదావ‌రి బ్యారేజీ నుంచి 30 అడుగుల లోతులో వాహనం బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 21మంది అక్కడికక్కడే మరణించారు. మరో 13 ఏళ్ల బాలిక ఈగల సంధ్య ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది.కుటుంబ పెద్ద, వాహ‌నం య‌జ‌మాని క‌మ్ డ్రైవర్‌ నిర్లక్షం వల్లే ప్రమాదం జరిగింది. అల‌స‌ట‌, విరామంలేకుండా వాహ‌నం న‌డ‌ప‌డ‌టంతోనే ఈ ఘోరం జ‌రిగింద‌ని నిర్ధారించారు.

మ‌హాపుష్క‌రాల్లో మ‌హా విషాదం
గోదావరి మ‌హా పుష్కరాల ప్రారంభం రోజునే మ‌హా విషాదం నెలకొంది. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు మొదటి పుష్కర్‌ఘాట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిస‌లాట‌లో 30 మంది చ‌నిపోయారు. వీఐపీ ఘాట్ ఉంటుండ‌గా..షార్ట్‌ఫిల్మ్ కోసం పుష్క‌ర‌ఘాట్‌లో గంట‌ల‌త‌ర‌బ‌డి చంద్ర‌బాబు షూటింగ్‌లో పాల్గొన్నార‌ని, దీంతో ల‌క్ష‌లాది మందిని ఘాట్‌లోకి రాకుండా పోలీసులు నిలిపేశార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. బాబు వెళ్లిపోయిన త‌రువాత ఒక్క‌సారి జ‌న‌ప్ర‌వాహం తోసుకురావ‌డంతో ఈ మ‌హావిషాదం చోటు చేసుకుంది.

'కూలి'పోయిన‌ బ‌తుకులు
తూర్పు గోదావరి జిల్లాలోని గుండేపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. మృతులంతా తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు, తొంగడి అన్నవరం ప్రాంతానికి చెందిన వలస కూలీలే. ఈ లారీలో 35 మందికి పైగా ప్ర‌యాణిస్తున్నారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నుంచి విశాఖకు ఈ లారీ సిమెంట్ బూడిద (ఫ్లై యాష్‌) లోడు) తీసుకుని వెళుతున్న లారీ ప్ర‌మాదానికి గురైంది. అతి వేగ‌మే కూలిబ‌తుకులు తెల్లారిపోవ‌డానికి కార‌ణ‌మ‌ని పోలీసులు ప్ర‌క‌టించారు.

జాగ్ర‌త్త‌లు తీసుకుని ఉంటే..
నాలుగు నెల‌ల కాలంలో నిర్ల‌క్ష్యం, ముందుజాగ్ర‌త్త లేక‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో తూర్పుగోదావ‌రి జిల్లాలో మ‌ర‌ణ మృదంగం మోగింది. ఇందులో పుష్క‌రాల విషాదం పూర్తిస్థాయి ప్ర‌భుత్వ యంత్రాంగం వైఫల్యంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.తూఫాన్ ప్ర‌మాదం అజాగ్ర‌త్త‌, అల‌స‌ట‌, ప‌రిమితికి మించి జ‌నాలు ఎక్క‌డం వ‌ల్ల జ‌రిగింది. గండేపూడి ద‌గ్గ‌ర లారీ బోల్తా ఘ‌ట‌న పూర్తిగా డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్య‌మే అయినా.. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా లారీలో ప్ర‌యాణికుల‌ను ఎక్కిస్తే.. హైవేపై ఒక్క చోట చూడా ఏ ఒక్క ప్ర‌భుత్వ‌శాఖ‌గానీ, పోలీసులు గానీ, ఆర్టీఏ అధికారులు గానీ చెక్ చేయ‌లేదు. ఈ మూడు విషాదాలూ మాన‌వ‌తప్పిదాలే. ఏ ఒక్క‌రు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించినా, ఏ ప్ర‌భుత్వ శాఖ ముందుగా స్పందించినా..తూర్పుగోదావ‌రి జిల్లాలో మూడుచోట్ల మోగిన మ‌ర‌ణ మృదంగానికి చెక్ పెట్టేవారే.

First Published:  15 Sep 2015 11:27 PM GMT
Next Story