Telugu Global
Cinema & Entertainment

కొర‌టాల'ను బుక్ చేసిన‌ గ‌ణేష్..! 

మొద‌టి స‌క్సెస్  త‌రువాత‌.. రెండో చిత్రం చేసి నిరూపించుకో పోతే..మొద‌టి  హిట్ ను  గాలివాటంగా వ‌చ్చింద‌ని  తేల్చేస్తారు.  కానీ కొర‌టాల శివ మాత్రం  క్రిటిక్స్ ఆ  ఛాన్స్ ఇవ్వ‌లేదు. త‌న ఫ‌స్ట్ ఫిల్మ్ మిర్చికంటే..  త‌న రెండో చి్త్రం శ్రీ‌మంతుడితో  బ్లాక్ బ‌స్ట‌ర్  స‌క్సెస్ ఇచ్చి త‌న స‌త్తాను స‌గ్వ‌రంగా చాటుకున్నాడు. దీంతో  ఇండస్ట్రీ అంతా   కొరటాల శివ  డేట్స్ కోసం  వెయిట్ చేస్తున్నారు. స్టార్ హీరోలంద‌రు   డేట్స్ ఇవ్వ‌డానికి  రెడిగా వున్నారు.  అలాగే మెగా ప్రొడ్యూస‌ర్స్ […]

కొర‌టాలను బుక్ చేసిన‌ గ‌ణేష్..! 
X

మొద‌టి స‌క్సెస్ త‌రువాత‌.. రెండో చిత్రం చేసి నిరూపించుకో పోతే..మొద‌టి హిట్ ను గాలివాటంగా వ‌చ్చింద‌ని తేల్చేస్తారు. కానీ కొర‌టాల శివ మాత్రం క్రిటిక్స్ ఆ ఛాన్స్ ఇవ్వ‌లేదు. త‌న ఫ‌స్ట్ ఫిల్మ్ మిర్చికంటే.. త‌న రెండో చి్త్రం శ్రీ‌మంతుడితో బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ ఇచ్చి త‌న స‌త్తాను స‌గ్వ‌రంగా చాటుకున్నాడు. దీంతో ఇండస్ట్రీ అంతా కొరటాల శివ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. స్టార్ హీరోలంద‌రు డేట్స్ ఇవ్వ‌డానికి రెడిగా వున్నారు. అలాగే మెగా ప్రొడ్యూస‌ర్స్ అంతా .. శివ డేట్స్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. ఒక్క మ‌నిషి. రెండు చేతులే కాబ‌ట్టి.. కొర‌టాల శివ ఆచి తూచి త‌న క‌మిట్ మెంట్స్ ఇస్తున్నాడు.

ఇక స‌క్సెస్ ఎక్క‌డ వుంటే అక్క‌డ వాలిపోయే మెగా ప్రొడ్య‌స‌ర్ బండ్ల గ‌ణేష్.. కొర‌టాల శివ తో ఒక చిత్రం చేయ‌డానికి ఆల్మోస్ట్ రంగం సిద్దం చేసుకున్నార‌ని ఫిల్మ్ న‌గ‌ర్ టాక్. మ‌రి భారీ ప్రొడ్యూస‌ర్.. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క‌లిస్తే.. ఒక రేంజ్ లో వుంటుంది రిజ‌ల్ట్. మ‌రి బండ్ల గ‌ణేష్ ఇంత‌కు ఏ హీరో ను కొర‌టాల శివ తో డైరెక్ట్ చేయిస్తాడో…! కచ్చితంగా మెగా హీరోల్లో ఎవ‌రో ఒక‌రు అవుతార‌నే టాక్ వినిపిస్తుంది.

First Published:  16 Sep 2015 8:30 PM GMT
Next Story