Telugu Global
Others

చిలీలో భారీ భూకంపం

చిలీలో గురువారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్ర‌త‌ రిక్టర్ స్కేలుపై 8.3 న‌మోదైంది. భారీ భూకంప‌న‌లు కొద్దిసేపు కొన‌సాగాయి. ఒక్క‌సారిగా భారీ భూకంపం చిలీని కుదిపేసింది. దీని త‌రువాత వ‌రుస‌గా ఆరుసార్లు భూమి కంపించింది.  వీటి తీవ్ర‌త రిక్ట‌ర్ స్టేల్‌పై 6గా నమోదైంది. భూకంపం కారణంగా ఆ దేశంలోని భవనాలు పేకమేడల్లా కుప్పకూలినట్లు ప్రాథమిక సమాచారం. ప‌దుల సంఖ్య‌లో జ‌నం మృత్యువాత ప‌డ్డారు.  చిలీ రాజధాని శాండియాగోకు 232 కిలోమీటర్ల దూరంలో, సముద్రమట్టానికి 10కిలోమీటర్ల లోతులో […]

చిలీలో భారీ భూకంపం
X

చిలీలో గురువారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్ర‌త‌ రిక్టర్ స్కేలుపై 8.3 న‌మోదైంది. భారీ భూకంప‌న‌లు కొద్దిసేపు కొన‌సాగాయి. ఒక్క‌సారిగా భారీ భూకంపం చిలీని కుదిపేసింది. దీని త‌రువాత వ‌రుస‌గా ఆరుసార్లు భూమి కంపించింది. వీటి తీవ్ర‌త రిక్ట‌ర్ స్టేల్‌పై 6గా నమోదైంది. భూకంపం కారణంగా ఆ దేశంలోని భవనాలు పేకమేడల్లా కుప్పకూలినట్లు ప్రాథమిక సమాచారం. ప‌దుల సంఖ్య‌లో జ‌నం మృత్యువాత ప‌డ్డారు. చిలీ రాజధాని శాండియాగోకు 232 కిలోమీటర్ల దూరంలో, సముద్రమట్టానికి 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భారీ తీవ్రతతో కూడిన భూకంపం నేపథ్యంలో వాల్ పరైసో, పెరూ, హవలీ తీరప్రాంతాల్లో పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. సునామీ హెచ్చ‌రిక‌ల‌తో స‌ముద్ర‌తీర‌ప్రాంత‌ ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. తీర ప్రాంత‌ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చిలీ భూకంపంతో న్యూజిలాండ్‌ కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసింది.

First Published:  17 Sep 2015 12:28 AM GMT
Next Story