మాఫీయా డాన్ పాత్రలో డిక్టేటర్…

తన 99వ ప్రయత్నంగా డిక్టేటర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు బాలయ్య. వినాయకచవితి కానుకగా ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఫస్ట్ లుక్ తోనే అందర్నీ ఎట్రాక్ట్ చేశాడు బాలయ్య. హుందాగా సోఫాపై కూర్చుంటూ.. సిగార్  కాలుస్తూ.. గుప్పుగుప్పమని పొగ వదిలే బాలయ్య ఫొటో అందర్నీ ఫస్ట్ లుక్ లోనే ఎట్రాక్ట్ చేసింది. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. శ్రీవాస్ దర్శకత్వంలో అంజలి హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈమధ్యే ఐరోపా షెడ్యూల్ పూర్తిచేసుకుంది. నెక్ట్స్ షెడ్యూల్ ను త్వరలోనే ప్రారంభిస్తారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా డిక్టేటర్ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. సినిమాలో బాలకృష్ణ పాత్ర ఏంటనే విషయాన్ని మాత్రం మేకర్స్ సీక్రెట్ గా ఉంచుతున్నారు. అయితే మూవీలో బాలయ్య ఓ మాఫియా డాన్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్.. ఆ ప్రచారానికి మరింత ఊతమిస్తోంది.