`శ్రీ‌మంతుడిని` వెట‌కారం చేశారా..?

ద‌ర్శ‌కుడు  క‌థ చెప్పిన‌ప్పుడు  న‌చ్చ‌లేదు అనే విష‌యాన్ని   వ్యక్త‌ ప‌ర‌చ‌డం కూడా ఒక క‌ళ‌.  అయితే కొంద‌రికి ఆ ఆర్ట్ తెలియ‌దు.  త‌మకు సూట్ కాద‌ని స్మార్ట్ గా చెప్పి త‌ప్పించుకోవ‌చ్చు. కానీ..   ద‌ర్శ‌కుడు ఎంతో న‌మ్మ‌కంతో సిద్దం చేసుకున్న క‌థ‌ను  అల్మోస్ట్ వెటకారం చేసి మాట్లాడే హీరోలు లేక పోలేదు.   శ్రీ‌మంతుడు క‌థ‌ను ..  ద‌ర్శ‌కుడు  కొర‌టాల శివ మ‌హేష్ బాబు న క‌ల‌వ‌డానికి ముందు ప‌లువురు స్టార్ హీరోల‌కు  వినిపించారు. వారిలో  ఒక‌రిద్ద‌రు  ఈ క‌థ విని..  ఈ దానాలేంటి.!.ధ‌ర్మాలేంటి..!  అస‌లిది సినిమా క‌థేనా అంటూ  వెట‌కారంగా మాట్లాడార‌ట‌.  అయితే  ద‌ర్శ‌కుడు  కొర‌టాల  వారి వెట‌కారాల్ని లైట్ గా తీసుకుని..  చివ‌ర‌కు మ‌హేష్ బాబు తో   శ్రీ‌మంతుడు చేసి.. త‌న స‌త్తా ఏంటో.. ఘ‌నంగా చాటుకున్నాడు.  క‌థ‌లు జడ్జ్ చేసుకోవడం చేత‌కాక పోతే  స్మార్ట్ గా త‌ప్పుకోవడం ఒక ప‌ద్ద‌తి.  అంతే కానీ.. మ‌రీ వెట‌కారం చేసి  త‌మ పిల్ల బుద్దుని చాటుకోవ‌డం  వెరీ బ్యాడ్ క‌దా..!