Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 209

‘అమ్మా! నా విలువ ఎంతంటావు? అన్నాడు పదేళ్ళ సురేష్‌. ‘బాబూ! నువ్వు కోటిరూపాయల విలువ చేస్తావు’ అంది తల్లి గారాబంగా. ‘ఐతే అడ్వాన్స్‌గా ఓ పదిరూపాయలివ్వు’ అన్నాడు కొడుకు. ——————————————————————– దాస్‌: మళ్ళీ ఈ రోజూ ఆఫీసుకు ఆలస్యంగా వచ్చావు. క్లర్క్‌: బాగా నిద్రపోయానండీ. పొద్దున్నే మెలకువే రాలేదు. దాస్‌: మరి ఇప్పుడు ఆఫీసుకు ఎలా వచ్చావు? క్లర్క్‌: నాకు నిద్రలో నడిచే అలవాటుందండీ! ——————————————————————– ‘ఇది మన ట్రెయినేనా?’ ‘కాదు. ఇది భారత ప్రభుత్వంది’ ‘అరే! […]

‘అమ్మా! నా విలువ ఎంతంటావు? అన్నాడు పదేళ్ళ సురేష్‌.
‘బాబూ! నువ్వు కోటిరూపాయల విలువ చేస్తావు’ అంది తల్లి గారాబంగా.
‘ఐతే అడ్వాన్స్‌గా ఓ పదిరూపాయలివ్వు’ అన్నాడు కొడుకు.
——————————————————————–

దాస్‌: మళ్ళీ ఈ రోజూ ఆఫీసుకు ఆలస్యంగా వచ్చావు.
క్లర్క్‌: బాగా నిద్రపోయానండీ. పొద్దున్నే మెలకువే రాలేదు.
దాస్‌: మరి ఇప్పుడు ఆఫీసుకు ఎలా వచ్చావు?
క్లర్క్‌: నాకు నిద్రలో నడిచే అలవాటుందండీ!
——————————————————————–

‘ఇది మన ట్రెయినేనా?’
‘కాదు. ఇది భారత ప్రభుత్వంది’
‘అరే! నవ్వులాటగా ఉందా? దీంతో మనం విజయవాడ వెళ్ళొచ్చా?’
‘ఇంత పెద్ద ట్రెయిన్‌ని మనం మొయ్యగలమా?’

First Published:  17 Sep 2015 1:03 PM GMT
Next Story