Telugu Global
Others

వెలుగులోకి నేతాజీ రహస్య ఫైళ్ళు!

నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ జీవితానికి సంబంధించిన రహస్య ఫైళ్ళను పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం బయట పెట్టింది. ఎంతోకాలంగా నేతాజీకి సంబంధించిన ఫైళ్ళను తమకు అందజేయాలని డిమాండు చేస్తున్న కుటుంబసభ్యుల కల నెరవేరింది. ప్రభుత్వం విడుదల చేసిన వాటిలో మొత్తం 64 ఫైళ్ళు ఉన్నాయి. ఇవన్నీ నేతాజీ జీవితానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తాయని భావిస్తున్నారు. 1937-47 సంవత్సరాల మధ్య నేతాజీ జీవితంలో జరిగిన వివిధ పరిణామాలు, ఆయన జీవితానికి సంబంధించిన వివిధ అంశాలు ఇందులో ఉంటాయని భావిస్తున్నారు. ప్రస్తుతం […]

వెలుగులోకి నేతాజీ రహస్య ఫైళ్ళు!
X
నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ జీవితానికి సంబంధించిన రహస్య ఫైళ్ళను పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం బయట పెట్టింది. ఎంతోకాలంగా నేతాజీకి సంబంధించిన ఫైళ్ళను తమకు అందజేయాలని డిమాండు చేస్తున్న కుటుంబసభ్యుల కల నెరవేరింది. ప్రభుత్వం విడుదల చేసిన వాటిలో మొత్తం 64 ఫైళ్ళు ఉన్నాయి. ఇవన్నీ నేతాజీ జీవితానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తాయని భావిస్తున్నారు. 1937-47 సంవత్సరాల మధ్య నేతాజీ జీవితంలో జరిగిన వివిధ పరిణామాలు, ఆయన జీవితానికి సంబంధించిన వివిధ అంశాలు ఇందులో ఉంటాయని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇవన్నీ పోలీసులు కుటుంబసభ్యులకు అందజేశారు. సోమవారం నుంచి ఈ 64 ఫైళ్ళను పోలీసు మ్యూజియంలో అందుబాటులో ఉంచనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వీటిని సోమవారం నుంచి సాధారణ పౌరులు కూడా చూసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే ప్రస్తుతం విడుదల చేసిన 64 ఫైళ్ళు పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం వద్ద ఉన్నవి మాత్రమే. ఇంకా కొన్ని కేంద్ర వద్ద ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
First Published:  18 Sep 2015 12:26 AM GMT
Next Story