Telugu Global
Cinema & Entertainment

న‌య‌న‌తార ద్విపాత్రాభిన‌యం!

అందాల న‌టి న‌య‌న‌తార మ‌రో ప్ర‌యోగానికి సిద్ధ‌మైంది. త‌న త‌దుప‌రి ప్రాజెక్టు ‘మయూరి’ చిత్రంలో న‌య‌న‌తార డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌నుంది. చాలాకాలం సినిమాల‌కు దూరంగా నిర్మాత‌, చిల్ల‌ర క‌ల్యాణ్ ఈ చిత్రాన్నినిర్మించ‌డం విశేషం. ఈ చిత్రంలో న‌య‌న‌తార‌వి రెండు పాత్ర‌లు. ఒక‌టి దెయ్యం పాత్ర కాగా, మ‌రొక‌టి ఒక బిడ్డ‌కు త‌ల్లి పాత్ర‌. ఛాలెంజింగ్ రోల్‌లో మెప్పించ‌డం న‌య‌న్‌కు కొత్తేం కాదు. గ‌తేడాది తీవ్ర‌వాద నేప‌థ్యంలో వ‌చ్చిన అనామిక చిత్రంలో త‌న న‌ట‌న‌తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందింది […]

న‌య‌న‌తార ద్విపాత్రాభిన‌యం!
X
అందాల న‌టి న‌య‌న‌తార మ‌రో ప్ర‌యోగానికి సిద్ధ‌మైంది. త‌న త‌దుప‌రి ప్రాజెక్టు ‘మయూరి’ చిత్రంలో న‌య‌న‌తార డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించ‌నుంది. చాలాకాలం సినిమాల‌కు దూరంగా నిర్మాత‌, చిల్ల‌ర క‌ల్యాణ్ ఈ చిత్రాన్నినిర్మించ‌డం విశేషం. ఈ చిత్రంలో న‌య‌న‌తార‌వి రెండు పాత్ర‌లు. ఒక‌టి దెయ్యం పాత్ర కాగా, మ‌రొక‌టి ఒక బిడ్డ‌కు త‌ల్లి పాత్ర‌. ఛాలెంజింగ్ రోల్‌లో మెప్పించ‌డం న‌య‌న్‌కు కొత్తేం కాదు. గ‌తేడాది తీవ్ర‌వాద నేప‌థ్యంలో వ‌చ్చిన అనామిక చిత్రంలో త‌న న‌ట‌న‌తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందింది ఈ మ‌ళ‌యాల ముద్దుగుమ్మ‌. ఈ చిత్రంమంతా ఓ రింగ్ చుట్టూ తిరుగుతుంద‌ని నిర్మాత క‌ల్యాణ్ వెల్ల‌డించాడు. ఆ రింగ్ క‌థేంటన్న‌ది తెర‌పై చూడాల్సిందేనంటున్నాడు. సినిమాకు క‌థే ప్రాణ‌మ‌ని చెప్పాడు. క‌థ విన్న కేవ‌లం 5 నిమిషాల్లోనే న‌య‌న్ పాత్ర చేయ‌డానికి అంగీక‌రించింద‌ని, న‌య‌న న‌ట‌న హైలైట్‌గా నిలుస్తుంద‌ని చెప్పాడు. ఈ చిత్రంలో మ‌రో పాత్ర‌కు హీరో నానిని అనుకున్నామ‌ని కానీ, ఆయ‌న డేట్లు అడ్జ‌స్ట్ కాక‌పోవ‌డంతో ఆ పాత్ర‌ను ప్ర‌కాష్‌రాజ్ చేశార‌ని చెప్పారు.
First Published:  17 Sep 2015 8:15 PM GMT
Next Story