చరణ్ ఆడియోకు పవన్ మాత్రం రాడు

మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏ ఫంక్షన్ జరిగినా ఆ వేడుకకు పవన్ కల్యాణ్ వస్తున్నాడంటూ ప్రచారం మొదలైపోతుంది. మొన్నటికి మొన్న కంచె ఆడియో ఫంక్షన్ విషయంలో కూడా అదే జరిగింది. పవన్ వస్తాడంటూ లాస్ట్ మినిట్ వరకు ప్రచారం జరిగింది. దీనివల్ల అసలు మేటర్ పక్కదోవ పడుతోంది. ఈ విషయాన్ని గ్రహించిన రామ్ చరణ్ ముందుగానే మేల్కొన్నాడు. తన కొత్త సినిమా బ్రూస్ లీ ఆడియో ఫంక్షన్ కు పవన్ బాబాయ్ రాడని ముందే క్లారిటీ ఇచ్చేస్తున్నాడు చెర్రీ. ఈనెల 26న జరగనున్న బ్రూస్ లీ పాటల వేడుకకు పవర్ స్టార్ రాడని, చిరంజీవి మాత్రం వస్తారని ముందే క్లియర్ గా చెప్పేస్తున్నాడు. దీనివల్ల పవన్ పై ఎలాంటి ప్రచారం జరగకుండా అంతా తన బ్రూస్ లీ సినిమా గురించే మాట్లాడుకుంటారని చెర్రీ భావిస్తున్నాడు. ఇది కూడా నిజమే. పవన్ రాడని ముందే తెలిస్తే.. ఇక ఆ యాంగిల్ లో అంతా ఆలోచించడం మానేస్తారు.