రజనీ ఫస్ట్ లుక్ కెవ్వు కేక

కొత్త దర్శకుడు రంజిత్ డైరక్షన్ లో ఓ సినిమా షురూ చేశాడు రజనీకాంత్. వినాయకచవితి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అంతేకాదు.. వినాయకచవితి సందర్భంగా సినిమా పూజాకార్యక్రమాలు కూడా నిర్వహించారు. వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెడతారు. ఫస్ట్ లుక్ లో భాగంగా రజనీకాంత్ తనదైన స్టయిల్ లో దర్జాగా కుర్చీలో కూర్చునే స్టిల్ ను విడుదల చేశారు. కబలి సినిమాలో రజనీకాంత్, డాన్ పాత్రలో కనిపిస్తారనే ప్రచారం ఇప్పటికే నడుస్తోంది. ఆ ప్రచారానికి ఈ ఫస్ట్ లుక్ కు సంబంధం లేకపోయినప్పటికీ.. తాజా పోస్టర్ తో రూమర్లు మరింత పెరిగాయి. అయితే ఫస్ట్ లుక్ మాత్రం విడుదల చేశారు తప్ప సినిమా పేరేంటనే విషయాన్ని మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. ఈ సినిమాలో రజనీ సరసన రాధికా ఆప్టే హీరోయిన్ గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్ విలన్ గా నటిస్తున్నాడు.