ఒకే రోజు రెండు వార్తలతో చెర్రీ హల్ చల్

రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్లు, ఫస్ట్ లుక్కులు కూడా విడుదలయ్యాయి. అయితే ఒకేరోజు రెండు వార్తలతో మరోసారి హల్ చల్ చేశాడు చరణ్. వినాయక చవితి సందర్భంగా మెగాభిమానులుక రెండు వార్తలు అందించాడు. వీటిలో ఒకటి ఆడియో ఫంక్షన్ డేట్. అవును.. ఈనెల 26న బ్రూస్ లీ ఆడియోను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కుదిరితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఆడియో విడుదల చేయాలనుకుంటున్నారు. మరోవైపు బ్రూస్ లీ సినిమాకు సంబంధించి ఓ మేకింగ్ వీడియోను కూడా విడుదల చేశారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి విదేశాల్లో షూట్ చేసిన ఓ సాంగ్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. విడుదలైన వెంటనే నెట్ లో ఆ వీడియో వైరల్ లా వ్యాపించింది. ఓ వైపు వరుణ్ తేజ నటించిన కంచె ఆడియో ఫంక్షన్ లో పాల్గొంటూనే మరోవైపు ఇలా రెండు హాట్ హాట్ వార్తలు విడుదలచేస్తూ.. నిన్నంతా బిజీగా గడిపాడు చెర్రీ.