Telugu Global
Others

ఇక ఆవు మూత్రంతో ఆపరేషన్‌ థియేటర్ల శుద్ధి!

అంతా అనుకున్నట్లు జరిగితే కొద్దిరోజుల్లో మనదేశంలోని ఆపరేషన్‌ థియేటర్లలో ఆవుమూత్రంతో శుద్ధిచేసిన పరికరాలతో ఆపరేషన్లు జరగనున్నాయి. రాజస్థాన్‌ ప్రభుత్వం ఉత్తర భారతదేశంలోని పెద్ద ఆసుపత్రులలో ఒకటైన జైపూర్‌ ఎస్‌ఎమ్‌ఎస్‌ ఆసుపత్రిలో ప్రయోగాత్మకంగా ఫినాల్‌ బదులు గోమూత్రాన్ని వినియోగిస్తోంది. ఒక సంస్థ తయారుచేసిన 50 సీసాల “గో క్లీన్‌”ను ఈ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్‌కేర్‌ యూనిట్‌లో, వివిధ వైద్యపరికరాలమీద, అలాగే ఆసుపత్రి నేలమీద 15రోజుల పాటు ప్రయోగించి చూసి, అది “డిస్‌ ఇన్‌ఫెక్టెంట్‌”గా ఎలా పనిచేస్తుందో పరిశీలించడానికి ముగ్గురు ప్రముఖ […]

ఇక ఆవు మూత్రంతో ఆపరేషన్‌ థియేటర్ల శుద్ధి!
X

అంతా అనుకున్నట్లు జరిగితే కొద్దిరోజుల్లో మనదేశంలోని ఆపరేషన్‌ థియేటర్లలో ఆవుమూత్రంతో శుద్ధిచేసిన పరికరాలతో ఆపరేషన్లు జరగనున్నాయి.
రాజస్థాన్‌ ప్రభుత్వం ఉత్తర భారతదేశంలోని పెద్ద ఆసుపత్రులలో ఒకటైన జైపూర్‌ ఎస్‌ఎమ్‌ఎస్‌ ఆసుపత్రిలో ప్రయోగాత్మకంగా ఫినాల్‌ బదులు గోమూత్రాన్ని వినియోగిస్తోంది. ఒక సంస్థ తయారుచేసిన 50 సీసాల “గో క్లీన్‌”ను ఈ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్‌కేర్‌ యూనిట్‌లో, వివిధ వైద్యపరికరాలమీద, అలాగే ఆసుపత్రి నేలమీద 15రోజుల పాటు ప్రయోగించి చూసి, అది “డిస్‌ ఇన్‌ఫెక్టెంట్‌”గా ఎలా పనిచేస్తుందో పరిశీలించడానికి ముగ్గురు ప్రముఖ డాక్టర్లతో ఒక కమిటీని నియమించినట్లు ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌ ప్రకాష్‌శర్మ వెల్లడించారు. రాజస్థాన్‌ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశాల మేరకు ఈ ప్రయోగం చేస్తున్నామని ఇది సక్సెస్‌ అయితే రాష్ట్ర ఆయుర్వేదశాఖ గోక్లీన్‌ పెద్దఎత్తున కమర్షియల్‌గా తయారు చేయడానికి, అమ్మకాలకు అనుమతిస్తుందని చెప్పారు.

First Published:  19 Sep 2015 1:55 AM GMT
Next Story