Telugu Global
Others

రాబర్ట్ వాద్రా కంపెనీపై ఈడీ కేసు!

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు కష్టాలు చుట్టుముడుతున్నాయి. రాజస్తాన్లోని బికనీర్లో360 హెక్టార్ల భూమి కుంభకోణానికి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రాబర్ట్ వాద్రా కంపెనీపై కేసు నమోదు చేసింది. ఈ కేసుతో సంబంధమున్న అన్ని కంపెనీలకు త్వరలోనే సమన్లు జారీ చేసి, ప్రశ్నించాలని ఈడీ నిర్ణయించింది. 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాబర్ట్ వాద్రాకు 360 హెక్టార్ల భూమిని కేటాయించింది. ఈ భూమి క్రయ విక్రయాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో 18 కేసులు […]

రాబర్ట్ వాద్రా కంపెనీపై ఈడీ కేసు!
X

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు కష్టాలు చుట్టుముడుతున్నాయి. రాజస్తాన్లోని బికనీర్లో360 హెక్టార్ల భూమి కుంభకోణానికి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రాబర్ట్ వాద్రా కంపెనీపై కేసు నమోదు చేసింది. ఈ కేసుతో సంబంధమున్న అన్ని కంపెనీలకు త్వరలోనే సమన్లు జారీ చేసి, ప్రశ్నించాలని ఈడీ నిర్ణయించింది. 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాబర్ట్ వాద్రాకు 360 హెక్టార్ల భూమిని కేటాయించింది. ఈ భూమి క్రయ విక్రయాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో 18 కేసులు నమోదయ్యాయి. 2014లో ఈకేసును కేంద్రం సీబీఐకి అప్పగించింది. తాజాగా రాబర్ట్ వాద్రాకు చెందిన కంపెనీపై ఈడీ కేసు నమోదు చేయడం సంచలనం సృష్టించింది. ఈ కేసుతో సంబంధమున్న అన్ని కంపెనీలకు త్వరలోనే నోటీసులు జారీ చేసి, ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమవుతోంది. ప్రస్తుత ఎఫ్ ఐ ఆర్లో రాబ్టర్ట్ వాద్రా పేరునుగానీ, కంపెనీని గానీ ఎక్కడా నేరుగా ప్రస్తావించలేదు. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. దీన్ని రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించింది. రాబర్ట్ ఎలాంటి తప్పు చేయలేదని సమర్థించింది. రెండు రోజుల క్రితమే రాబర్ట్ వాద్ర కోరిక మేరకు విమానాశ్రయాల్లో తనిఖీల నుంచి మినహాయించే వీవీఐపీ హోదాను ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే!

First Published:  18 Sep 2015 9:16 PM GMT
Next Story