Telugu Global
NEWS

తెలంగాణలో నాటుసారాపై ఉక్కుపాదం

మూడు నెలల్లో 41 వేల కేసులు… 16 వేల మంది అరెస్ట్‌ తెలంగాణలో గుడుంబా పేరుతో తయారవుతున్న నాటుసారా మహమ్మారిని కూకటివేళ్ళతో పీకేయాలని అబ్కారీ శాఖ ప్రయత్నిస్తోంది. ఈ దిశగా పావులు కదుపుతూ దీని తయారీ స్థావరాలపైన, తయారు చేస్తున్న ఉత్పత్తిదారులపైన ఉక్కుపాదం మోపుతున్నారు. ఆరోగ్యాన్ని కబళిస్తూ జీవన ప్రమాణాలను దెబ్బతీస్తున్న ఈ మహమ్మారి నుంచి సామాన్య ప్రజలకు విముక్తి కల్పించడానికి అధికారులు అసాధారణ చర్యలు చేపట్టారు. మూడు నెలల కాలంలో ఇప్పటివరకూ దాదాపు 41 వేల […]

తెలంగాణలో నాటుసారాపై ఉక్కుపాదం
X
మూడు నెలల్లో 41 వేల కేసులు… 16 వేల మంది అరెస్ట్‌
తెలంగాణలో గుడుంబా పేరుతో తయారవుతున్న నాటుసారా మహమ్మారిని కూకటివేళ్ళతో పీకేయాలని అబ్కారీ శాఖ ప్రయత్నిస్తోంది. ఈ దిశగా పావులు కదుపుతూ దీని తయారీ స్థావరాలపైన, తయారు చేస్తున్న ఉత్పత్తిదారులపైన ఉక్కుపాదం మోపుతున్నారు. ఆరోగ్యాన్ని కబళిస్తూ జీవన ప్రమాణాలను దెబ్బతీస్తున్న ఈ మహమ్మారి నుంచి సామాన్య ప్రజలకు విముక్తి కల్పించడానికి అధికారులు అసాధారణ చర్యలు చేపట్టారు. మూడు నెలల కాలంలో ఇప్పటివరకూ దాదాపు 41 వేల కేసులు నమోదు చేశారు. 16 వేల మందిని అరెస్టు చేశారు. ఆరు లక్షల లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. అవసరమైతే పీడీ యాక్ట్‌ను కూడా అమలు చేయాలన్న సీఎం ఆదేశాలతో 11 మందిపై ఆ చట్టాన్ని కూడా ప్రయోగించారు. రానున్న రోజుల్లో తమ చర్యలు మరింత కఠినంగా ఉండబోతున్నాయని సంకేతాలిస్తున్న అధికారులు… ప్రజల సహకారం ఉంటే నాటుసారాను సమూలంగా రూపు మాపుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆబ్కారీ అధికారులకు పోలీసులు అండగా నిలవడంతో సమిష్టిగా సమరం సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో మూడు నెలలుగా గుడుంబా ప్రభావిత ప్రాంతాలను జల్లెడ పడుతున్న ఆబ్కారీ అధికారులు… రాష్ట్రంలో వారానికో గ్రామాన్ని నాటుసారా రహితంగా చేయాలన్న లక్ష్యంతో ముందుకు కదులుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉత్పత్తిదారులు, ముడిసరుకు పంపిణీదారులు, మధ్యవర్తుల జాబితాను ఇప్పటికే ఆబ్కారీ శాఖ తయారు చేసింది. దీన్ని దగ్గర పెట్టుకుని ఒక్కో గ్రామంపై దాడి చేస్తూ నాటుసారాను నిరోధిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 3,500 గ్రామాలలో గుడుంబా సమస్య తీవ్రంగా ఉందని అధికారులు గుర్తించారు. వచ్చే యేడాదినాటికి రాష్ట్రంలో ఒక్క గ్రామంలో కూడా నాటుసారా తయారీ కేంద్రంగాని, విక్రయ కేంద్రంగాని ఉండకూడదన్న లక్ష్యంతో అబ్కారీ శాఖ ముందుకు కదులుతోంది.
First Published:  19 Sep 2015 5:19 AM GMT
Next Story