80వ సంవత్సరములోకి అడుగిడిన సందర్భంగా ప్రజానటి, కళాభారతి జమునకు యువకళావాహిని ఆధ్వర్యంలో శనివారం సెప్టెంబరు19న హైదరాబాదు ప్రసాద్ ఫిలిం లాబ్‌లో జరిగిన సభలో లైప్ టైమ్ ఎచీవ్మెంటు అవార్డు తమిళనాడు గవర్నరు డా॥ కొణిజేటి రోశయ్యచే ప్రధానం చేయబడింది. ఈ సందర్భంగా ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. యువకళావాహిని అధ్యక్షులు వై.కె. నాగేశ్వరరావు అతిధులకు స్వాగతం పలికారు. ఈ సభకు సారిపల్లి కొండలరావు అధ్యక్షత వహించగా, కైకాల సత్యనారాయణ, డా॥ కె.వి.కృష్ణకుమారి, గీతాంజలి, రోజారమణి, రేలంగి నరసింహారావు, రమేష్ ప్రసాద్ మరియు నిర్మాత కె.సి.శేఖర్‌బాబు పాల్గొన్నారు. సభకుముందు జమున నటించిన చిత్రాలలోని కొన్నిపాటలు ప్రదర్శించారు.