Telugu Global
National

ఎల్జేపీ తొలి జాబితా విడుదల!

బీహార్ ఎన్నికల్లో పార్టీ మధ్య పొత్తు గొడవలు క్రమంగా కొలిక్కి వస్తున్నాయి. తాజాగా లోక్ జనశక్తి (ఎల్జేపీ) శుక్రవారం 12 మంది అభ్యర్థులతో తన తొలి జాబితా ప్రకటించింది. ఇందులో పార్టీ అధ్యక్షుడు రాంవిలాస్ పాశ్వాన్ సోదరుడు, సొదరుడి కుమారుడు కూడా ఉన్నారు.  పాశ్వాన్ సోదరుడు పశుపతి కుమార్ పరాస్ అలౌలీ నుంచి పోటీ చేయనున్నారు. అలాగే పాశ్వాన్ సోదరుడు, ఎంపీ రామచంద్ర పాశ్వాన్ కుమారుడు ప్రిన్స్ రాజ్ కల్యాణ్పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. గొవింద్ […]

ఎల్జేపీ తొలి జాబితా విడుదల!
X
బీహార్ ఎన్నికల్లో పార్టీ మధ్య పొత్తు గొడవలు క్రమంగా కొలిక్కి వస్తున్నాయి. తాజాగా లోక్ జనశక్తి (ఎల్జేపీ) శుక్రవారం 12 మంది అభ్యర్థులతో తన తొలి జాబితా ప్రకటించింది. ఇందులో పార్టీ అధ్యక్షుడు రాంవిలాస్ పాశ్వాన్ సోదరుడు, సొదరుడి కుమారుడు కూడా ఉన్నారు. పాశ్వాన్ సోదరుడు పశుపతి కుమార్ పరాస్ అలౌలీ నుంచి పోటీ చేయనున్నారు. అలాగే పాశ్వాన్ సోదరుడు, ఎంపీ రామచంద్ర పాశ్వాన్ కుమారుడు ప్రిన్స్ రాజ్ కల్యాణ్పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. గొవింద్ గంజ్ నుంచి పోటీ చేస్తున్న రాజు తివారీపై పలు నేరారోపణలు ఉండటం గమనార్హం. ఈ జాబితాను పార్టీ పార్లమెంటరీ బోర్డు ఛైర్మన్, ఎంపీ చిరాగ్ పాశ్వాన్ ప్రకటించారు. ఎన్డీఏ- మిత్రపక్షాల పొత్తులో భాగంగా ఎల్జేపీకి 40 సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే! ఇందులో 29 సీట్లపై అన్ని పార్టీలో ఏకాభిప్రాయం కుదిరిందని, మరో 11 సీట్లపైనా త్వరలోనే ఏకాభిప్రాయం వస్తుందని చిరాగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖదం పూర్ నుంచి మాంజీ!
బీహార్ మాజీ ముఖ్యమంత్రి స్థాపించిన హిందుస్తాన్ అవామ్ మోర్చా (హెచ్ ఏ ఎం) పార్టీ కూడా 13 స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించింది. ఎన్డీఏ- మిత్రపక్షాల పొత్తులో భాగంగా ఎల్జేపీకి 20 సీట్లు దక్కించుకుంది హెచ్ ఏ ఎం. ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి మాంజీ పేరు కూడా ఉంది. ఆయన ముఖదం పూర్ నుంచి పోటీ చేయనున్నారు.
First Published:  18 Sep 2015 9:29 PM GMT
Next Story