Telugu Global
CRIME

భార్య గర్భం కోసం పక్కింటోడిపై కేసు!

… వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. జర్మనీలో జరిగిన… జరుగుతున్న ఓ యదార్థ సంఘటన. సౌఫోలోస్‌ అనే 29 యేళ్ళ యువకుడికి పెళ్లయి ఐదేళ్ళయినా పిల్లలు పుట్టలేదు. డాక్టర్లను సంప్రదిస్తే పిల్లలు పుట్టే యోగం లేదని తేల్చేశారు. సౌపోలోస్‌ భార్య మాజీ బ్యూటీ క్వీన్‌, మోడల్‌ కూడా. పిల్లల కోసం భార్య పెట్టే హింసను భరించలేక పక్కింటి ప్రాక్‌ మౌస్‌తో ఓ ఒప్పందం కుదుర్చుకున్నాడు. భార్య కూడా దీనికి సమ్మతి తెలిపింది. తన భార్యకు 72 […]

భార్య గర్భం కోసం పక్కింటోడిపై కేసు!
X
… వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. జర్మనీలో జరిగిన… జరుగుతున్న ఓ యదార్థ సంఘటన. సౌఫోలోస్‌ అనే 29 యేళ్ళ యువకుడికి పెళ్లయి ఐదేళ్ళయినా పిల్లలు పుట్టలేదు. డాక్టర్లను సంప్రదిస్తే పిల్లలు పుట్టే యోగం లేదని తేల్చేశారు. సౌపోలోస్‌ భార్య మాజీ బ్యూటీ క్వీన్‌, మోడల్‌ కూడా. పిల్లల కోసం భార్య పెట్టే హింసను భరించలేక పక్కింటి ప్రాక్‌ మౌస్‌తో ఓ ఒప్పందం కుదుర్చుకున్నాడు. భార్య కూడా దీనికి సమ్మతి తెలిపింది. తన భార్యకు 72 ప్రయత్నాల్లో గర్భం చేస్తే 2500 డాలర్లు చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. కేవలం డబ్బు కోసమే ‘ఆ పని’ చేస్తున్నానంటూ ప్రాంక్‌ కూడా తన భార్యను ఒప్పించాడు. మొత్తం మీద 72 ‘ప్రయత్నాలు’ అయిపోయాయి కాని గర్భం రాలేదు. ఇంతవరకు సాఫీగా సాగిన కథ ఇక్కడే అసలు మలుపు తిరిగింది. ప్రాంక్‌కు సౌఫోలోస్‌ వైద్య పరీక్షలు జరిపించాడు. అతనికి సంతాన యోగం లేదని వైద్యులు తేల్చేశారు. దాంతో సౌపోలోస్‌ కోర్టును ఆశ్రయించాడు. ప్రాంక్‌ తనను మోసం చేశాడని కోర్టుకు విన్నవించాడు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఫ్రాంక్‌ భార్య ఒక నిజం బయట పెట్టింది. తన ఇద్దరు పిల్లలు ఫ్రాంక్‌ వల్ల పుట్టలేదని, తన పిల్లలకు తండ్రి ఫ్రాంక్‌ కాదంటూ ఆమె బాంబు పేల్చేసింది. విషయం తెలుసుకున్న సౌఫోలోస్ తన డబ్బులు తనకిచ్చేయమని అడిగాడు. దానికి ప్రాంక్‌ ససేమిరా అన్నాడు. తానెంతో కష్టపడ్డానని, డబ్బులు తిరిగి ఇచ్చేది లేదని తెగేసి చెప్పేశాడు. పైవాడి దయ లేకపోతే తానేం చేస్తానని కోర్టుకు కూడా విన్నవించాడు. అనేక ఆసక్తికర మలుపులతో నడిచిన ఈ యదార్థ సంఘటన తీర్పు కోసం ఎదురు చూస్తోంది. ఈ కేసులో న్యాయమూర్తులు ఎలాంటి తీర్పు ఇస్తారోననన్న ఆసక్తి ఇపుడు అందరిలో నెలకొంది.
First Published:  18 Sep 2015 1:11 PM GMT
Next Story