హాలో సైనా..  దిస్ ఈజ్  షారుక్ ఖాన్..!

sharukhషారుక్ ఖాన్  . ఒక బ్రాండ్.  బాలీవుడ్ లో ల‌వ‌ర్ బోయ్ ఇమేజ్ ను గెయిన్ చేసిన అభ‌న‌వ  దిలిప్ కుమార్.  దిల్ వాలే దుల్హ‌నియ లేజాయింగే చిత్రం స‌క్సెస్ తో    షారుక్ ఖాన్ అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు.ఈ సినిమా   రిలీజ్ అయిన‌ప్పుడు..ఓ ఐదేళ్ల పాప‌..  20 ఏళ్ల త‌రువాత‌.. త‌న డ్రీమ్ హీరో నుంచి  డైరెక్ట్ గా  ఫోన్ వ‌స్తుంద‌ని  క‌ల‌లో కూడా ఊహించి ఉండ‌దు. ఆఫ్ కోర్స్.. ఆ 5 ఏళ్ల పాప సాధార‌ణ అమ్మాయి కాదు.   ప్ర‌స్తుతం  ఇండియ‌న్ బ్యాట్మెంటెన్   స్టార్.  ప్ర‌పంచ నెంబ‌ర్ వ‌న్ గా  ఎదిగిన  సెల్ఫ్ మేడ్  ప‌ర్స‌న్. ఆమే  సైనా నెహ్వ‌ల్.

  ఈ  వినాయ‌క చ‌వితి పండ‌గ త‌న‌కు ఎంతో స్పెష‌ల్  అంటోంది.  షారుక్ ఖాన్  పండ‌గ‌కు స్వ‌యంగా  సైనా నెహ్వాల్ ను  త‌మ ఇంటికి  గెస్ట్ గా ఆహ్వానించిరాట‌.  ఒక‌టి అర కాకుండా.. ఏకండా రెండు గంట‌ల సేపే ఎన్నో విశేషాలు   మాట్లాడార‌ట‌.  దిల్ వాలే  దుల్హ‌నియ లేజాయింగే రిలీజ్ అయిన‌ప్పుడు.. త‌న ఐదేళ్ల చిన్నార‌ని  చెప్పింద‌ట‌.  ఆ సినిమాకు షూటింగ్ కు సంబంధించిన ఎన్నో విశేషాలు   సైనా  నెహ్వాల్  తో ముచ్చ‌టించార‌ట‌. ఆ త‌రువాత  సైన త‌న అభిమాన హీరోకు  రాకేట్  గిఫ్ట్ గా ఇచ్చారు.  ఇద్ద‌రు ఆ రాకెట్స్ తో  సెల్ఫీలు  తీసుకున్నారు.  ఆ పిక్స్  షారుక్ కూడా  త‌న ట్విట‌ర్ లో పోస్ట్ చేసి  మై డే విత్ సైనా అని పెట్టారు.   సైనా తో నే ఎంద‌రో  ఫోటోలు దిగాల‌నుకుంటారు.  అటువంటింది.. ఈ స్టార్ ప్లేయ‌ర్ .. త‌న ఫేవ‌రేట్  హీరో  పండ‌గ ఆదిత్యానికి ఫిదా అయిపోయింద‌న్న‌మాట‌.   అవును  అస‌లే   షారుక్ ఖాన్ క‌దా.!