Telugu Global
Others

ఆస్పత్రిలో నాడు ఎలుకలు... నేడు పాములు!

గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో పసికందును పొట్టన పెట్టుకున్న ఎలుకలను మరిచిపోక ముందే ఇపుడు పాములు ప్రత్యక్షమవుతున్నాయి. అసలు ఈ ఎలుకల బాధకే భయపడిపోయి తల్లిదండ్రులు ఆస్పత్రికి తమ పిల్లల్ని తీసుకురావడం కొన్నాళ్ళు మానేశారు. తర్వాత తగ్గించేశారు. దీంతో ఆస్పత్రికి వచ్చే పిల్లల కేసులు తగ్గిపోయాయి. ఇపుడు పాములు తిరుగుతున్నాయంటే ఈ ఆస్పత్రిలో ఎలాంటి వాతావరణం ఉందో అర్ధం చేసుకోవచ్చు. వరుసగా రెండు రోజులపాటు ఈ ఆస్పత్రిలో పాములు కనిపించాయి. ఈ పాములను గుట్టుచప్పుడు కాకుండా సిబ్బంది చంపేశారు. శుక్రవారం […]

ఆస్పత్రిలో నాడు ఎలుకలు... నేడు పాములు!
X
గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో పసికందును పొట్టన పెట్టుకున్న ఎలుకలను మరిచిపోక ముందే ఇపుడు పాములు ప్రత్యక్షమవుతున్నాయి. అసలు ఈ ఎలుకల బాధకే భయపడిపోయి తల్లిదండ్రులు ఆస్పత్రికి తమ పిల్లల్ని తీసుకురావడం కొన్నాళ్ళు మానేశారు. తర్వాత తగ్గించేశారు. దీంతో ఆస్పత్రికి వచ్చే పిల్లల కేసులు తగ్గిపోయాయి. ఇపుడు పాములు తిరుగుతున్నాయంటే ఈ ఆస్పత్రిలో ఎలాంటి వాతావరణం ఉందో అర్ధం చేసుకోవచ్చు. వరుసగా రెండు రోజులపాటు ఈ ఆస్పత్రిలో పాములు కనిపించాయి. ఈ పాములను గుట్టుచప్పుడు కాకుండా సిబ్బంది చంపేశారు. శుక్రవారం సిటీ స్కాన్‌ చేసే గదిలోకి వచ్చిన పాము ఎలుకల కోసం ఏర్పాటు చేసిన బోనులో ఇరుక్కుపోయింది. ఈ విషయం బయటకు తెలియకుండా అధికారులు పామును కాల్చి బూడిద చేసేశారు. తర్వాత నిన్న మరో పాము కనిపించింది. దీంతో పాములు పట్టేవారిని పిలిచారు. ఎలుకల వల్ల పసికందు చనిపోయిన నేపథ్యంలో చేసిన పరిశుభ్రత ఎంత డొల్లగా ఉందో ప్రస్తుత పరిస్థితి దర్పణం పడుతోంది.
First Published:  19 Sep 2015 2:38 AM GMT
Next Story