Telugu Global
Cinema & Entertainment

 నాగార్జున సినిమా పేరు అదే..

ఎన్టీఆర్ సినిమాకు ఎలాగైతే ముందునుంచి అనుకుంటున్నట్టు నాన్నకు ప్రేమతో అనే టైటిల్ ఫిక్స్ చేశారో.. నాగార్జన నయా మూవీకి కూడా అదే విధంగా ఊపిరి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నాగార్జున-కార్తి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ  మల్టీస్టారర్ మూవీకి ఊపిరి అనే పేరుపెడుతున్నారనే విషయాన్ని తెలుగుగ్లోబల్ ఎప్పుడో బయటపెట్టింది. ఇప్పుడదే టైటిల్ ను ఫిక్స్ చేస్తున్నట్టు తాజాగా అఫీషియల్ స్టేట్ మెంట్ వచ్చింది. హాలీవుడ్ లో హిట్టయిన ఇన్ టచబుల్స్ అనే సినిమా ఆధారంగా ఊపిరి […]

 నాగార్జున సినిమా పేరు అదే..
X
ఎన్టీఆర్ సినిమాకు ఎలాగైతే ముందునుంచి అనుకుంటున్నట్టు నాన్నకు ప్రేమతో అనే టైటిల్ ఫిక్స్ చేశారో.. నాగార్జన నయా మూవీకి కూడా అదే విధంగా ఊపిరి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నాగార్జున-కార్తి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ మూవీకి ఊపిరి అనే పేరుపెడుతున్నారనే విషయాన్ని తెలుగుగ్లోబల్ ఎప్పుడో బయటపెట్టింది. ఇప్పుడదే టైటిల్ ను ఫిక్స్ చేస్తున్నట్టు తాజాగా అఫీషియల్ స్టేట్ మెంట్ వచ్చింది. హాలీవుడ్ లో హిట్టయిన ఇన్ టచబుల్స్ అనే సినిమా ఆధారంగా ఊపిరి తెరకెక్కుతోంది. ఈ సినిమా కథకు దర్శకుడు వంశీ పైడిపల్లితో పాటు హరి, సాల్మన్ కలిసి చాలా మార్పులు చేశారు. సౌత్ నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేసి తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఒక విధంగా చెప్పాలంటే ఇదొక ప్రయోగాత్మక చిత్రమే. ఎందుకంటే.. హీరో నాగార్జున ఇందులో చాలా భాగం వీల్ చైర్ లో కనిపిస్తాడు. ఆ ఎలిమెంటే ఈ సినిమాకు ప్రచారం తెచ్చిపెడుతోంది. టైటిల్ ను కన్ ఫర్మ్ చేసిన మేకర్స్.. సినిమా విడుదల తేదీని మాత్రం ఇంకా స్పష్టంచేయలేదు.
First Published:  19 Sep 2015 4:35 AM GMT
Next Story