పేరు మారిస్తే హిట్ వస్తుందా..

ఎంతో సీనియర్ దర్శకుడు వంశీ. తన సినిమాలతో తెలుగుతెరపై ట్రెండ్ క్రియేట్ చేశాడు. అలాంటి వంశీ ఇప్పుడు డౌన్ ఫాన్ లో ఉన్నాడని అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఈ దర్శకుడితో సినిమా చేసేందుకు నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎక్కడైనా, ఏ సినిమాతోనైనా హిట్ ఇస్తాడనే చిన్న ఆశ ఇంకా ఇండస్ట్రీలో మిగిలే ఉంది. అందులో భాగంగానే తన 25వ సినిమాను తెరకెక్కించాడు వంశీ. అంతా బాగానే ఉందికానీ.. ఈ సినిమా టైటిల్ ను ఇప్పటికి 3సార్లు మార్చడం మాత్రం ఏమాత్రం బాగాలేదు. సినిమాను ఎనౌన్స్ చేసినప్పుడు.. తను మొన్నే వెళ్లిపోయింది అనే పేరుపెట్టారు. అప్పట్లో ఈ పేరుకు ప్రచారం కూడా బాగానే జరిగింది. తర్వాత ఏమైందో ఏమో.. మెల్లగా తట్టింది మనసు తలుపు అనే పేరు ఫిక్స్ చేశారు. ఆ పేరు కూడా కొన్నాళ్లు నానింది. అయితే అందర్నీ షాక్ కు గురిచేస్తూ..వెన్నెల్లో హాయ్ హాయ్ అంటూ మరో టైటిల్ తో మరోసారి ముందుకొచ్చాడు వంశీ. వినాయకచవితి సందర్భంగా ఈ సినమా పోస్టర్లు విడుదల చేస్తూ.. వెన్నెల్లో హాయ్ హాయ్ అనే టైటిల్ ను ప్రకటించారు. ఈ టైటిల్ అయినా ఉంచుతారో లేదో చూడాలి.