Telugu Global
Others

వాటే జోక్ బాబు

“పార‌ద‌ర్శ‌కంగా ఇసుక త‌వ్వ‌కాలు, స‌ర‌ఫ‌రా జ‌ర‌గాల‌నే డ్వాక్రా గ్రూపుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించాం. అయినా ఇసుక త‌వ్వ‌కాలు, విక్ర‌యాలు, స‌ర‌ఫ‌రాపై ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇసుక అక్ర‌మాల‌ను స‌హించం. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం.” అంటూ క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. అయితే ఇసుక మాఫియాపై చ‌ర్య‌లు తీసుకునేంత సాహ‌సం చంద్ర‌బాబు చేస్తారా అనేదే ఇప్పుడు క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌ను వేధిస్తున్న ప్ర‌శ్న‌. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపండి చంద్రబాబు పిలుపిచ్చార‌ని, అక్ర‌మార్కుల‌ను ప‌ట్టుకుంటే..త‌మ‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే ఆందోళ‌న […]

వాటే జోక్ బాబు
X

“పార‌ద‌ర్శ‌కంగా ఇసుక త‌వ్వ‌కాలు, స‌ర‌ఫ‌రా జ‌ర‌గాల‌నే డ్వాక్రా గ్రూపుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించాం. అయినా ఇసుక త‌వ్వ‌కాలు, విక్ర‌యాలు, స‌ర‌ఫ‌రాపై ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇసుక అక్ర‌మాల‌ను స‌హించం. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం.” అంటూ క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. అయితే ఇసుక మాఫియాపై చ‌ర్య‌లు తీసుకునేంత సాహ‌సం చంద్ర‌బాబు చేస్తారా అనేదే ఇప్పుడు క‌లెక్ట‌ర్లు, ఎస్పీల‌ను వేధిస్తున్న ప్ర‌శ్న‌. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపండి చంద్రబాబు పిలుపిచ్చార‌ని, అక్ర‌మార్కుల‌ను ప‌ట్టుకుంటే..త‌మ‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికి కృష్ణా జిల్లా త‌హ‌సీల్దారు వ‌న‌జాక్షి ఇసుక అక్ర‌మ త‌వ్వ‌కాల‌ను అడ్డుకునేందుకు వెళ్లి టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్, ఆయ‌న అనుచరుల దాడిలో గాయ‌ప‌డింది. దీనిపై రాష్ర్ట‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు జ‌రిగాయి. విదేశీ ప‌ర్య‌ట‌న నుంచి వ‌చ్చిన సీఎం చంద్ర‌బాబు త‌హ‌సీల్దార్‌ను పిలిచి..నీ లిమిట్స్ కాని ప్రాంతంలోకి ఎందుకెళ్లావంటూ వ‌న‌జాక్షినే తిరిగి ప్ర‌శ్నించార‌నే క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. ఈ ఒక్క సంఘ‌ట‌న‌తోనే ఇసుక మాఫియా ఎంత ప‌వ‌ర్‌ఫుల్లో అధికార‌యంత్రాంగానికి తెలిసొచ్చింది. అందుకే డ్వాక్రాసంఘాల ముసుగులో సాగుతున్న ఇసుక దందాను చూసీచూడ‌న‌ట్టు వ‌దిలేస్తున్నారు.
బాబూ వీళ్ల‌పై చ‌ర్య‌లు తీసుకోగ‌ల‌రా?
ఏపీలో ఇసుక మాఫియా వెనుక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు..చివ‌రికి ప్ర‌తిప‌క్షానికి చెందిన ప్ర‌జాప్ర‌తినిధులు, మాజీలున్నార‌నేది అంద‌రికీ తెలిసిన బ‌హిరంగ ర‌హ‌స్యం. స్వ‌యంశ‌క్తి సంఘాల ముసుగులో దందాలు న‌డిపించేదంతా పెద్ద త‌ల‌కాయ‌లే. ఏ వ్యాపారంలోనూ రాని లాభం, ఏ ప‌థ‌కం నుంచి చూడ‌నంత రాబ‌డి వ‌స్తుంటే ఎవ‌రు మాత్రం ఊరుకుంటారు చెప్పండి. ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రుగా మారిన ఇసుక అక్ర‌మ‌త‌వ్వ‌కాల‌ను సీఎం అరిక‌ట్ట‌గ‌ల‌రా అనేదే మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఇసుక మాఫియాను విక్రయాలలో అక్రమాలను అరికట్టడానికే రేవులను డ్వాక్రా మహిళ సంఘాలకు అప్పగించామని బాబు చెబుతున్నారు. అయితే అదే డ్వాక్రా సంఘాల ముసుగులో దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ మ‌హిళా త‌హ‌సీల్దార్‌పై దారుణాతిదారుణంగా దాడి చేశారు. కేవ‌లం ఇసుక త‌వ్వ‌కాల‌ను అడ్డుకున్నందుకే ఈ దాడి జ‌రిగింద‌ని ఉద్యోగ సంఘాలు, విప‌క్షాలు ఆరోపించాయి. అయినా ఎమ్మెల్యేపై చ‌ర్య‌ల్లేవు. త‌హ‌సీల్దార్‌కు నాలుగు చీవాట్లు ప‌డ్డాయి. ఇదీ న‌డ‌స్తున్న చ‌రిత్ర‌. ఇసుక వెనుక ఉన్న చీక‌టి కోణాల‌ను వ‌దిలేసి.. ఇసుక అక్ర‌మ త‌వ్వ‌కాలు, విక్రయాలపై కమిటీలు వేయాలని కలెక్టర్లకు బాబు ఆదేశాలిచ్చారు. ఇసుక వ్య‌వ‌హారాల‌పై వస్తున్న విమర్శలను సానుకూలంగా తీసుకుని, వాటిని స్పందిద్దామని, మనసాక్షిగా పనిచేద్దామని చంద్రబాబు వ్యాఖ్యానించడం విశేషం. ప్ర‌భుత్వం వ‌ద్ద ఉన్న ర‌హ‌స్య నివేదిక ప్ర‌కారం ఏపీలోని న‌లుగురు మంత్రులు, 38 మంది ఎమ్మెల్యేలు త‌మ ప్రాంతాల్లో ఇసుక మాఫియాల‌ను న‌డిపిస్తున్నార‌ట‌. వీరంద‌రిపై బాబు చ‌ర్య‌లు తీసుకోగ‌ల‌రా?

First Published:  20 Sep 2015 3:15 AM GMT
Next Story