Telugu Global
Cinema & Entertainment

మైసూర్ లో సోగ్గాడి హల్ చల్

నాగార్జున హీరోగా సోగ్గాడే చిన్ని నాయనా అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు తాజాగా మైసూర్ లో ప్రారంభమైంది. సినిమాకి ఇదే చివరి షెడ్యూల్. ప్రస్తుతం మైసూర్ లో నాగార్జున-లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా కొన్ని సీన్లు, మరికొన్ని సాంగ్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇది కంప్లీట్ అయిపోగానే సినిమాకు గుమ్మడికాయ కొట్టేస్తారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. సినిమాలో ఒక క్యారెక్టర్ లో ఆత్మలా కనిపించబోతున్నాడు. ఆ ఆత్మ […]

మైసూర్ లో సోగ్గాడి హల్ చల్
X
నాగార్జున హీరోగా సోగ్గాడే చిన్ని నాయనా అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు తాజాగా మైసూర్ లో ప్రారంభమైంది. సినిమాకి ఇదే చివరి షెడ్యూల్. ప్రస్తుతం మైసూర్ లో నాగార్జున-లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా కొన్ని సీన్లు, మరికొన్ని సాంగ్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇది కంప్లీట్ అయిపోగానే సినిమాకు గుమ్మడికాయ కొట్టేస్తారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. సినిమాలో ఒక క్యారెక్టర్ లో ఆత్మలా కనిపించబోతున్నాడు. ఆ ఆత్మ పాత్ర ఒక్క నాగార్జునకే కనిపిస్తుంది. ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్ లో నాగార్జున చేస్తున్న సినిమా సోగ్గాడే చిన్నినాయనా. కథపై నమ్మకంతో తనే స్వయంగా అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు నాగార్జున. తన సెంటిమెంట్ ప్రకారం డిసెంబర్ లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
First Published:  19 Sep 2015 7:00 PM GMT
Next Story