Telugu Global
Cinema & Entertainment

 బ్రహ్మోత్సవంలో షారూక్ ఖాన్

బ్రహ్మోత్సవంలో మహేష్ బాబు హీరో అనే విషయం మనందరికీ తెలిసిందే. మరి షారూక్ ఎలా వచ్చాడు. బ్రహ్మోత్సవం సినిమాకు షారూక్ కు సంబంధం ఏంటి? సంబంధం ఏమీ లేదు. కాకపోతే బ్రహ్మోత్సవం సెట్స్ లో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు షారూక్. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న బ్రహ్మోత్సవం సినిమా.. షారూక్ చేస్తున్న దిల్ వాలే సినిమా షూటింగులు ఒకే వేదికపై జరుగుతున్నాయి. రామోజీ ఫిలింసిటీలోనే ఇద్దరూ ఉన్నారు. మహేష్ నటించిన వన్-నేనొక్కడినే సినిమాలో హీరోయిన్ గా చేసిన కృతి సనోన్.. […]

 బ్రహ్మోత్సవంలో షారూక్ ఖాన్
X
బ్రహ్మోత్సవంలో మహేష్ బాబు హీరో అనే విషయం మనందరికీ తెలిసిందే. మరి షారూక్ ఎలా వచ్చాడు. బ్రహ్మోత్సవం సినిమాకు షారూక్ కు సంబంధం ఏంటి? సంబంధం ఏమీ లేదు. కాకపోతే బ్రహ్మోత్సవం సెట్స్ లో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు షారూక్. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న బ్రహ్మోత్సవం సినిమా.. షారూక్ చేస్తున్న దిల్ వాలే సినిమా షూటింగులు ఒకే వేదికపై జరుగుతున్నాయి. రామోజీ ఫిలింసిటీలోనే ఇద్దరూ ఉన్నారు. మహేష్ నటించిన వన్-నేనొక్కడినే సినిమాలో హీరోయిన్ గా చేసిన కృతి సనోన్.. ప్రస్తుతం షారూక్ తో దిల్ వాలే సినిమా చేస్తోంది. ఈ అమ్మాయే మహేష్-షారూక్ ను కలిపింది. కృతి సనోన్ చొరవతో బ్రహ్మోత్సవం సెట్స్ లో మహేష్-షారూక్ కలుసుకున్నారు. మహేష్ తో పాటు నమ్రతా శిరోద్కర్, మహేష్ కూతురు తో షారూక్ కాసేపు మాట్లాడాడు. మహేష్ ను కలవడం ఆనందంగా ఉందంటూ ట్వీట్ కూడా చేశాడు. తర్వాత మహేష్ కూడా థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశాడు.
First Published:  19 Sep 2015 7:03 PM GMT
Next Story