Telugu Global
Others

విద్యార్థుల నుంచి 3 కిలోల గంజాయి స్వాధీనం

ఈజీగా డబ్బు సంపాదించే మార్గంలో తిరుగుతున్న ముగ్గురు విద్యార్థులు పోలీసులకు పట్టుబడ్డారు. అయితే వీరు చేసే పని చూసి పోలీసులకే దిమ్మ తిరిగిపోయింది. నలుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు గంజాయి తరలిస్తూ దొరికిపోయారు. వీరు విశాఖ ఏజెన్సీ డుంబ్రిగుడ వద్ద పోలీసులు పట్టుబడ్డారు. వీరిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. పోలీసుల కథనం మేరకు… విద్యార్థుల కదలికలపై అనుమానం వచ్చి విశాఖ ఏజెన్సీ డుంబ్రిగుడ మండల సమీపంలోని కంబవలస వద్ద నిఘా ఉంచగా ఈ నలుగురు పట్టుబడ్డారు. […]

ఈజీగా డబ్బు సంపాదించే మార్గంలో తిరుగుతున్న ముగ్గురు విద్యార్థులు పోలీసులకు పట్టుబడ్డారు. అయితే వీరు చేసే పని చూసి పోలీసులకే దిమ్మ తిరిగిపోయింది. నలుగురు ఇంజినీరింగ్‌ విద్యార్థులు గంజాయి తరలిస్తూ దొరికిపోయారు. వీరు విశాఖ ఏజెన్సీ డుంబ్రిగుడ వద్ద పోలీసులు పట్టుబడ్డారు. వీరిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. పోలీసుల కథనం మేరకు… విద్యార్థుల కదలికలపై అనుమానం వచ్చి విశాఖ ఏజెన్సీ డుంబ్రిగుడ మండల సమీపంలోని కంబవలస వద్ద నిఘా ఉంచగా ఈ నలుగురు పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని బ్యాగులు తనిఖీ చేయగా మూడు కిలోల గంజాయి లభ్యమైంది. వీరిలో గణేష్‌ చెన్నైలోని ఎఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బిటెక్‌ పూర్తి చేశారు. దిలీప్‌, రాజు విశాఖపట్నంలోని పైడా, రత్నం అవంతి ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బిటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

First Published:  19 Sep 2015 1:20 PM GMT
Next Story