పూరి అప్పుడే ముగించేశాడు

ఈమధ్యే వరుణ్ తేజ హీరోగా లోఫర్ అనే సినిమా ప్రారంభించాడు పూరి జగన్నాధ్. అప్పుడే ఆ సినిమా షూటింగ్ ను క్లైమాక్స్ కు తీసుకొచ్చాడు. అవును.. పూరి జగన్నాధ్-వరుణ్ తేజ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లోఫర్ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం కంచె సినిమాకు డబ్బింగ్ చెప్పే పనిలో ఉన్నాడు వరుణ్ తేజ. ఈ డబ్బింగ్ పూర్తిచేసుకొని గోవా వెళ్లి లోఫర్ సినిమా బ్యాలెన్స్ లో పాల్గొంటే షూటింగ్ అయిపోయినట్టే. తక్కువ బడ్జెట్ లో, అతితక్కువ రోజుల్లో పూర్తిచేసిన ఈ సినిమాను వీలైనంత తొందరగా థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. చూస్తుంటే.. కంచె రిలీజైన షార్ట్ గ్యాప్ లోనే లోఫర్ కూడా విడుదలయ్యేట్టు కనిపిస్తోంది.  సీకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రేవతి, పోసాని కృష్ణమురళి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. పటాస్, జిల్లా సినిమాల్లో విలన్ గా నటించిన చరణ్ దీప్.. లోఫర్ లో కూడా విలన్ గా నటిస్తున్నాడు.