Telugu Global
Cinema & Entertainment

అఖిల్ గ్రాండ్ ఎంట్రీకి రంగం సిద్ధం

అక్కినేని నటవారసుడు, మూడో తరం హీరో, ఫ్యూచర్ సూపర్ స్టార్ అఖిల్ ఎంట్రీకి కౌంట్ డౌన్ గ్రాండ్ గా మొదలైంది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను ఘనంగా నిర్వహించారు. పాటల్ని విడుదల చేయడంతో పాటు ట్రయిలర్ ను కూడా గ్రాండ్ గా లాంచ్ చేశారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహేష్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. ట్రయిలర్ ను లాంచ్ చేసి అఖిల్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇక అమల […]

అఖిల్ గ్రాండ్ ఎంట్రీకి రంగం సిద్ధం
X
అక్కినేని నటవారసుడు, మూడో తరం హీరో, ఫ్యూచర్ సూపర్ స్టార్ అఖిల్ ఎంట్రీకి కౌంట్ డౌన్ గ్రాండ్ గా మొదలైంది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను ఘనంగా నిర్వహించారు. పాటల్ని విడుదల చేయడంతో పాటు ట్రయిలర్ ను కూడా గ్రాండ్ గా లాంచ్ చేశారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహేష్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. ట్రయిలర్ ను లాంచ్ చేసి అఖిల్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఇక అమల ఆడియో ఫస్ట్ సీడీని ఆవిష్కరించారు. అనూప్-తమన్ సంయుక్తంగా ఈ సినిమాకు బాణీలు సమకూర్చారు. సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 22న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు కింగ్ నాగార్జున. గ్రాండ్ గా జరిగిన ఈ వేడుకకు మహేష్ తోపాటు సుశాంత్, నాగచైతన్య కూడా హాజరయ్యరు. విడుదలైన 10 గంటలోనే ఈ ట్రయిలర్ కు దాదాపు లక్షకు పైగా హిట్స్ రావడం విశేషం. సినిమా విడుదలైన తర్వాత అఖిల్ ఏ రేంజ్ లో ఇరగదీస్తాడో చూడాలి.

First Published:  20 Sep 2015 10:00 PM GMT
Next Story