Telugu Global
Others

రాయలసీమ ప్రాజెక్టు పంపుతో కోస్తాకు నీళ్ళు

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం మరోసారి వంచించింది. గోదావరి, కృష్ణా నదుల సాక్షిగా హంద్రీనీవా ప్రాజెక్టు మోటార్లు పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి తరలించారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం మల్యాలలో ఉన్న హంద్రీ నీవా ప్రాజెక్టుకు చెందిన 12 పంపుల్లో ఆరో పంపును పట్టిసీమకు తరలించారు. అత్యంత రహస్యంగా జరిగిన ఈ అంశం బయటకు పొక్కడంతో చంద్రబాబు ప్రభుత్వంలోని అధికారులు నాలుక్కరుచుకుంటున్నారు. పట్టిసీమ తెస్తాం… రాయలసీమకు నీళ్ళిస్తాం… అని చంద్రబాబు ఆయన వందిమాగదులు చెప్పే డాంభికం కబుర్లు […]

రాయలసీమ ప్రాజెక్టు పంపుతో కోస్తాకు నీళ్ళు
X

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం మరోసారి వంచించింది. గోదావరి, కృష్ణా నదుల సాక్షిగా హంద్రీనీవా ప్రాజెక్టు మోటార్లు పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి తరలించారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం మల్యాలలో ఉన్న హంద్రీ నీవా ప్రాజెక్టుకు చెందిన 12 పంపుల్లో ఆరో పంపును పట్టిసీమకు తరలించారు. అత్యంత రహస్యంగా జరిగిన ఈ అంశం బయటకు పొక్కడంతో చంద్రబాబు ప్రభుత్వంలోని అధికారులు నాలుక్కరుచుకుంటున్నారు. పట్టిసీమ తెస్తాం… రాయలసీమకు నీళ్ళిస్తాం… అని చంద్రబాబు ఆయన వందిమాగదులు చెప్పే డాంభికం కబుర్లు వినేవారికి ఈ సంఘటనతో చిర్రెత్తుకొస్తోంది. సీమకు నీళ్ళివడం మాట అటుంచి ఇపుడు సీమకు నీళ్ళను సరఫరా చేసే పంపులనే పీక్కుపోయారంటే ఆ ప్రాంతంపై ప్రభుత్వానికి ఎంత మమకారం ఉందో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న రాయలసీమ వాసులు రగిలిపోతున్నారు. ఆందోళనకు దిగుతున్నారు. రాయలసీమకు నీరివ్వడానికే పట్టిసీమ అని ప్రగల్బాలు పలికిన చంద్రబాబు… నీరివ్వకపోగా, ఇక్కడి మోటరు తీసుకు వెళ్లి రహస్యంగా అమర్చారని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ప్రజలను ఇలా మోసం చేశారని విమర్శించారు. హంద్రీనీవా మోటారును బిగించి నీరు వదిలితేనే తమ్మిలేరుపై ఆక్విడెక్ట్ కూలి పోయిందని, ఈ ప్రాజెక్టు నాణ్యత ఎంత అద్వాన్నంగా ఉందో అర్దం చేసుకోవచ్చని ఆయన విమర్శించారు. మొత్తం మోటార్లు బిగిస్తే పట్టిసీమ మొత్తం దరిదాపుల్లో ఉన్న గ్రామాల్ని ముంచేయడం ఖాయమని ఆయన అన్నారు.

First Published:  21 Sep 2015 1:49 AM GMT
Next Story