Telugu Global
Others

స్టెల్లా కాలేజీలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య?

విజయవాడలోని స్టెల్లా కాలేజీ హాస్టల్‌లో ఓ విద్యార్ధిని భానుప్రీతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇది ఆత్మహత్య కాదని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విద్యార్ధిని తండ్రి ఆరోపిస్తున్నారు. తన కుమార్తె చవితి పండుగ కోసం ఇంటికి వచ్చి నిన్ననే కాలేజీకి వచ్చిందని, అయితే ఆమెను ఏ కారణాలతోనో చంపేసి ఆత్మహత్యగా కాలేజీ యాజమాన్యం ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. తన కూతురు చనిపోయిందని ఫోన్‌ చేసి చెప్పిన‌ తర్వాత ఒక్కరు కూడా […]

స్టెల్లా కాలేజీలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య?
X

విజయవాడలోని స్టెల్లా కాలేజీ హాస్టల్‌లో ఓ విద్యార్ధిని భానుప్రీతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇది ఆత్మహత్య కాదని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విద్యార్ధిని తండ్రి ఆరోపిస్తున్నారు. తన కుమార్తె చవితి పండుగ కోసం ఇంటికి వచ్చి నిన్ననే కాలేజీకి వచ్చిందని, అయితే ఆమెను ఏ కారణాలతోనో చంపేసి ఆత్మహత్యగా కాలేజీ యాజమాన్యం ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. తన కూతురు చనిపోయిందని ఫోన్‌ చేసి చెప్పిన‌ తర్వాత ఒక్కరు కూడా అందుబాటులో లేకుండా కాలేజీ యాజమాన్యం పరారయిపోయిందని ఆయన తెలిపారు.
భానుప్రీతి స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం. ఈ ఏడాదే స్టెల్లా కాలేజీలో చేరింది. ఆదివారం వరకు తన స్వస్థలంలోనే ఉన్న భాను, 14 రోజుల పండుగ సెలవుల తర్వాత తిరిగి కాలేజీకి వచ్చింది. వచ్చిన మరునాడే ఇలా భాను ఆత్మహత్య చేసుకుందంటున్నారు. అయితే సంఘటన స్థలంలో ఆత్మహత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. సూసైడ్ నోట్ వంటివి కూడా ఏమీ కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. వాస్తవానికి భాను ప్రీతి కాలేజీలోని ఓ పరీక్షకు హాజరుకావాల్సి ఉంది. అయితే, ఫ్రెండ్స్‌తో తనకు ఆరోగ్యం బాగో లేదని, అందుకే కాలేజీకి రావడం లేదని చెప్పిందంటున్నారు. తోటి స్నేహితులు అంతా క్లాసులకు వెళ్లి వచ్చేలోపు భాను హాస్టల్‌లో ఉరి వేసుకుని ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. కాగా, మరోవైపు భాను సూసైడ్‌కు యాజమాన్యం కారణమంటూ విద్యార్థి సంఘాలకు ఆందోళనకు దిగాయి.
ఫ్యానుకు నేలకు ఎంతో వ్యత్సాసం లేకపోవడం, నైలాన్‌ తాడుకు ఉరి వేసుకున్నట్టు చెబుతున్న భాను ప్రీతి మెడకు ఎలాంటి గాయం లేకపోవడం వంటి కారణాలు చూపిస్తూ తమ కూతురిది ఖచ్చితంగా హత్యేనని తండ్రి చెబుతున్నారు. విద్యార్థి భాను ప్రీతి మరణంపై ఏబీవీపీ సంఘం కాలేజీ వద్దకు వచ్చి బైఠాయించింది. న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండు చేస్తోంది. బీజేపీ తదితర పక్షాల నాయకులు కూడా స్టెల్లా కాలేజీకి వచ్చి నిరసన ప్రదర్శన చేస్తున్నారు. కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. యాజమాన్యానికి- విద్యార్థులకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంతో పోలీసులు భారీ ఎత్తున రంగంలోకి దిగారు.

First Published:  21 Sep 2015 12:34 PM GMT
Next Story