Telugu Global
Others

నీళ్ల సీసాను అనుమ‌తించ‌క‌పోతే..మ‌ల్టీఫ్లెక్స్ లకు బారీ జ‌రిమానా

నిర్బంధ దోపిడీకి స‌రైన శిక్ష ప‌డింది. మాల్స్‌, మ‌ల్టీప్లెక్స్‌లు, థియేట‌ర్లలో సాగుతున్న బ‌హిరంగ దందాల‌కు జాతీయ వినియోగ‌దారుల ఫోరం తీర్పు చెంప‌పెట్టు కానుంది. 20 రూపాయ‌ల వాట‌ర్ బాటిల్ అనుమ‌తించ‌నందుకు ఏకంగా 11,000 జ‌రిమానా క‌ట్టాల్సి వ‌చ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా క‌థ‌నం మేర‌కు .. ఢిల్లీలోని రుపాసి మ‌ల్టీఫ్లెక్స్‌లో అగ‌ర్త‌లాకు చెందిన ఓ కుటుంబం  సినిమా చూసేందుకు వెళ్లింది. త‌మ‌తోపాటు వాట‌ర్ బాటిల్ తీసుకెళ్తే మ‌ల్టీఫ్లెక్స్ సిబ్బంది అడ్డుకున్నారు. దీనిపై వారు నేష‌న‌ల్ క‌న్స్యూమ‌ర్స్ డిస్ప్యూట్ […]

నీళ్ల సీసాను అనుమ‌తించ‌క‌పోతే..మ‌ల్టీఫ్లెక్స్ లకు బారీ జ‌రిమానా
X

నిర్బంధ దోపిడీకి స‌రైన శిక్ష ప‌డింది. మాల్స్‌, మ‌ల్టీప్లెక్స్‌లు, థియేట‌ర్లలో సాగుతున్న బ‌హిరంగ దందాల‌కు జాతీయ వినియోగ‌దారుల ఫోరం తీర్పు చెంప‌పెట్టు కానుంది. 20 రూపాయ‌ల వాట‌ర్ బాటిల్ అనుమ‌తించ‌నందుకు ఏకంగా 11,000 జ‌రిమానా క‌ట్టాల్సి వ‌చ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా క‌థ‌నం మేర‌కు .. ఢిల్లీలోని రుపాసి మ‌ల్టీఫ్లెక్స్‌లో అగ‌ర్త‌లాకు చెందిన ఓ కుటుంబం సినిమా చూసేందుకు వెళ్లింది. త‌మ‌తోపాటు వాట‌ర్ బాటిల్ తీసుకెళ్తే మ‌ల్టీఫ్లెక్స్ సిబ్బంది అడ్డుకున్నారు. దీనిపై వారు నేష‌న‌ల్ క‌న్స్యూమ‌ర్స్ డిస్ప్యూట్ రెడ్రెస‌ల్ క‌మిష‌న్‌ను ఆశ్ర‌యించారు. కేసు విచారించిన క‌మిష‌న్‌.. 11 వేలు జ‌రిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. టికెట్ కొని వ‌చ్చే ప్రేక్ష‌కుల‌కు అందుబాటులో ఉచితంగా సుర‌క్షిత‌మైన మంచినీరు స‌ర‌ఫ‌రా చేయాల‌ని నిబంధ‌న‌లున్నాయి. ఇవేమీ క‌ల్పించ‌కుండా వాట‌ర్ బాటిల్స్ అనుమ‌తించ‌క‌పోవ‌డం చ‌ట్టాన్ని అతిక్ర‌మించ‌డ‌మే జ‌స్టిస్ వీకే జైన్‌, బీసీ గుప్తాలతో కూడిన ధ‌ర్మాస‌నం అభిప్రాయ‌ప‌డింది.

First Published:  21 Sep 2015 2:36 AM GMT
Next Story