Telugu Global
Others

ఢిల్లీలో బాలికపై గ్యాంగ్ రేప్

దేశ రాజధాని ఢిల్లీలో మరో బాలికపై అత్యాచారం జరిగింది. 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని కిడ్నాప్ చేసి ఆమెపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. నజఫ్‌గఢ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టునట్లు 14 యేళ్ళ ఈ బాలిక తెలిపింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అత్యాచార సంఘటన అంతా వీడియో తీశారని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే సోషల్‌ వెబ్‌సైట్లలో పెట్టి ప్రచారం చేస్తామని బెదిరించారని బాలిక తెలిపింది. ఎంత కట్టడి చేసినా… […]

ఢిల్లీలో బాలికపై గ్యాంగ్ రేప్
X

దేశ రాజధాని ఢిల్లీలో మరో బాలికపై అత్యాచారం జరిగింది. 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని కిడ్నాప్ చేసి ఆమెపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. నజఫ్‌గఢ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టునట్లు 14 యేళ్ళ ఈ బాలిక తెలిపింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అత్యాచార సంఘటన అంతా వీడియో తీశారని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే సోషల్‌ వెబ్‌సైట్లలో పెట్టి ప్రచారం చేస్తామని బెదిరించారని బాలిక తెలిపింది. ఎంత కట్టడి చేసినా… పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఢిల్లీలో నేరాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి కాని తగ్గడం లేదు.

First Published:  20 Sep 2015 1:06 PM GMT
Next Story