Telugu Global
Cinema & Entertainment

వెనిస్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో విరిసిన ఆటోడ్రైవర్‌ చంద్ర‌(న్) కాంతులు

ఓ ఆటో డ్రైవ‌ర్ రాసిన న‌వ‌ల  ఆధారంగా తీసిన సినిమా వెనిస్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ప్ర‌ద‌ర్శించారు. టెన్త్‌క్లాస్ ఫెయిలైన ఓ వ్య‌క్తి రాసిన న‌వ‌ల ‘బెస్ట్‌ డాక్యుమెంట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్ అవార్డు అందుకుంది. క‌ష్టాలు, క‌న్నీళ్ల‌తో సాగిన త‌న జీవితాన్ని స‌మాజ కోణంలో చూసి రాసిన ఆ వ్య‌క్తి పేరే చంద్ర‌న్ అలియాస్ ఆటో చంద్ర‌న్‌. పుట్టింది త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరు. ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష త‌ప్పి.. ఇంటి నుంచి పారిపోయి గుంటూరు చేరాడు. అనాథ‌లా పెరిగాడు. కొంత‌మంది  […]

వెనిస్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో విరిసిన ఆటోడ్రైవర్‌ చంద్ర‌(న్) కాంతులు
X

ఓ ఆటో డ్రైవ‌ర్ రాసిన న‌వ‌ల ఆధారంగా తీసిన సినిమా వెనిస్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ప్ర‌ద‌ర్శించారు. టెన్త్‌క్లాస్ ఫెయిలైన ఓ వ్య‌క్తి రాసిన న‌వ‌ల ‘బెస్ట్‌ డాక్యుమెంట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్ అవార్డు అందుకుంది. క‌ష్టాలు, క‌న్నీళ్ల‌తో సాగిన త‌న జీవితాన్ని స‌మాజ కోణంలో చూసి రాసిన ఆ వ్య‌క్తి పేరే చంద్ర‌న్ అలియాస్ ఆటో చంద్ర‌న్‌. పుట్టింది త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరు. ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష త‌ప్పి.. ఇంటి నుంచి పారిపోయి గుంటూరు చేరాడు. అనాథ‌లా పెరిగాడు. కొంత‌మంది కుర్రాళ్ల‌తో క‌లిసి తిరుగుతుండ‌గా.. గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 13 రోజుల‌పాటు లాక‌ప్‌లో వేసి చిత‌క్కొట్టారు. చేసినా, చేయ‌క‌పోయినా..ఒప్పుకున్నా, ఒప్పుకోక‌పోయినా..తామ‌నుకున్న‌ది, త‌మ‌కు కావాల్సిన దొరికాక అంద‌రినీ వ‌దిలేశారు. ఆ పదమూడు రోజుల పాటు… ప్రతి రోజు…ప్రతి క్షణం తను అనుభవించిన నరకాన్ని ‘లాకప్‌’ నవలగా మలిచాడు. అది ఓ 26 ఏళ్ల త‌రువాత పుస్త‌క‌రూపంలోకి వ‌చ్చింది. 2006లో ‘బెస్ట్‌ డాక్యుమెంట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌’ అవార్డు కూడా అందుకుంది. చంద్రన్‌ నవలను తమిళ దర్శకుడు వెట్రిమారన్ సినిమాగా రూపొందించాడు. ‘విచారణైస పేరుతో రూపొందిన ఈ సినిమాకు ధనుష్‌ నిర్మాత. త్వ‌ర‌లో విడుద‌ల కానున్న ఈ సినిమాకు వెనిస్‌లో జరిగిన చిత్రోత్సవంలో ప్రదర్శితమైంది. ఈ సినిమా పండుగకు ప్రపంచ నలుమూలల నుంచి 120 దేశాలకు చెందిన 2000 సినిమాలు వస్తే వాటిలో 20 చిత్రాలు ఎంపికయ్యాయి. వాటిలో ఆటోచంద్ర‌న్ న‌వ‌ల ఆధారంగా రూపొందిన విచార‌ణై ఒక‌టి. 72వ వెనిస్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన తొలి తమిళ చిత్రం కావడం, సినిమా ప‌రిశ్ర‌మ‌తో సంబంధంలేని ఓ ఆటోడ్రైవ‌ర్ రాసిన న‌వ‌ల ఆధారంగా రూపొంద‌డం వంటి విశేషాలున్న ఈ మూవీ రిలీజ్ కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

First Published:  21 Sep 2015 12:06 AM GMT
Next Story