Telugu Global
NEWS

1200 మంది విద్యుత్‌ ఉద్యోగులకు ఊరట

తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల క్రితం ఉద్యోగాల నుంచి రిలీవ్‌ చేసిన 1200 విద్యుత్‌ ఉద్యోగులకు తాత్కాలిక ఊరట లభించించి. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు వెంటనే జీతాలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీరంతా ఏ రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు అనే విషయాన్ని పక్కనపెట్టి ప్రస్తుతం వారు తెలంగాణలో పని చేస్తున్నందున ఈ రాష్ట్ర ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని, అయితే జీతాల మొత్తంలో 58 శాతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, 42 శాతం తెలంగాణ ప్రభుత్వం […]

1200 మంది విద్యుత్‌ ఉద్యోగులకు ఊరట
X

తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల క్రితం ఉద్యోగాల నుంచి రిలీవ్‌ చేసిన 1200 విద్యుత్‌ ఉద్యోగులకు తాత్కాలిక ఊరట లభించించి. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు వెంటనే జీతాలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీరంతా ఏ రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు అనే విషయాన్ని పక్కనపెట్టి ప్రస్తుతం వారు తెలంగాణలో పని చేస్తున్నందున ఈ రాష్ట్ర ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని, అయితే జీతాల మొత్తంలో 58 శాతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, 42 శాతం తెలంగాణ ప్రభుత్వం భరించాలని సూచించింది. నాలుగు వారాల్లోగా వీరందరికీ జీతాలు చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే తుది తీర్పు వచ్చే వరకు వీరందరినీ తెలంగాణ ఉద్యోగులుగానే పరిగణించాలని హైకోర్టు ఆదేశించింది. అప్పటివరకు తెలంగాణలోనే కొనసాగించాలని తీర్పు చెప్పింది.

First Published:  22 Sep 2015 2:42 AM GMT
Next Story