Telugu Global
NEWS

శేషాచలంపై వారంలోగా నివేదిక ఇవ్వండి:  హైకోర్టు

శేషాచలం ఎన్‌కౌంట‌ర్‌ కేసు విచారణ ఎందుకు జాప్యమవుతోందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు జాప్యానికి కారణాలేంటని, దీనిపై విచారణ చేపట్టిన ప్రత్యేక విచారణ బృందం (సిట్)ను నిలదీసింది. సిట్ విచారణకు తాము కేవలం 60 రోజులు గడువు విధించగా, 140 రోజులైనా కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంపై  హైకోర్టు అక్షింతలు వేసింది. కాగా ఫోరెన్సిక్ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నామని సిట్ తరఫు న్యాయవాది, అదనపు అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వెల్లడించారు. శాస్ర్తీయ పరమైన అంశాలను […]

శేషాచలంపై వారంలోగా నివేదిక ఇవ్వండి:  హైకోర్టు
X
శేషాచలం ఎన్‌కౌంట‌ర్‌ కేసు విచారణ ఎందుకు జాప్యమవుతోందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు జాప్యానికి కారణాలేంటని, దీనిపై విచారణ చేపట్టిన ప్రత్యేక విచారణ బృందం (సిట్)ను నిలదీసింది. సిట్ విచారణకు తాము కేవలం 60 రోజులు గడువు విధించగా, 140 రోజులైనా కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంపై హైకోర్టు అక్షింతలు వేసింది. కాగా ఫోరెన్సిక్ రిపోర్టు కోసం ఎదురుచూస్తున్నామని సిట్ తరఫు న్యాయవాది, అదనపు అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వెల్లడించారు. శాస్ర్తీయ పరమైన అంశాలను విశ్లేషించుకునేందుకు అనుభవజ్ఞుల కోసం చూస్తున్నామని, ఇందుకోసం స్థానిక మేజిస్ర్టేటు అనుమతి కోరామని ఆయన చెప్పిన సమాధానంపై హైకోర్టు ఒకింత అసహనం వ్యక్తం చేసింది. అనుభవజ్ఞుల నియామకం కోసం మా ఆదేశాలు కావాలా? అని ప్రశ్నించింది. ఇక నుంచి సిట్ తరఫున తాను వాదనలు వినిపిస్తానని, ప్రభుత్వం తరఫున మరొకరు వాదిస్తారని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ తెలిపారు. దీనిపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. గతంలో ప్రతివాదులందరి తరఫున వాదించి ఇప్పుడు సిట్ తరఫున ఎలా వాదిస్తారని ప్రశ్నించింది. వారంలోగా కేసుకు సంబంధించిన నివేదిక అంజేయాల్సిందిగా ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ను హైకోర్టు ఆదేశించింది.
First Published:  21 Sep 2015 9:09 PM GMT
Next Story