Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 213

టీచర్‌: (ఫోన్లో) మీ రాజేష్‌కు బాగా కోల్డు చేసిందని, జ్వరమొచ్చిందని స్కూలుకు రాలేడని అంటున్నారు? ఇంతకూ మీరెవరు? అటువేపునించి: నేను మా ఫాదరే టీచర్‌! ————————————————————————————————————————- లావుపాటి స్త్రీ తన స్నేహితురాలితో “ఆ వేయింగ్‌మిషన్‌ (బరువు తెలిపే మిషన్‌) అంటే నాకు చాలా చిరాకు, దాని దగ్గరకు వెళ్ళాలంటే నాకిష్టముండదు?” స్నేహితురాలు: ఏమిటి? ఎందుకని? లావుపాటి స్త్రీ: నేను బరువు తెలుసుకోవాలని దానిపైన నిల్చున్నప్పుడల్లా “వన్‌ పర్సన్‌ అట్‌ వన్‌ టైం” (ఒకసారికి ఒక మనిషి) అంటుంది! […]

టీచర్‌: (ఫోన్లో) మీ రాజేష్‌కు బాగా కోల్డు చేసిందని, జ్వరమొచ్చిందని స్కూలుకు రాలేడని అంటున్నారు? ఇంతకూ మీరెవరు?
అటువేపునించి: నేను మా ఫాదరే టీచర్‌!
————————————————————————————————————————-
లావుపాటి స్త్రీ తన స్నేహితురాలితో
“ఆ వేయింగ్‌మిషన్‌ (బరువు తెలిపే మిషన్‌) అంటే నాకు చాలా చిరాకు, దాని దగ్గరకు వెళ్ళాలంటే నాకిష్టముండదు?”
స్నేహితురాలు: ఏమిటి? ఎందుకని?
లావుపాటి స్త్రీ: నేను బరువు తెలుసుకోవాలని దానిపైన నిల్చున్నప్పుడల్లా “వన్‌ పర్సన్‌ అట్‌ వన్‌ టైం” (ఒకసారికి ఒక మనిషి) అంటుంది!
————————————————————————————————————————-
శేషు: మీ పదిగదుల కొత్తిఇల్లు ఎలావుంది?
వాసు: కోళ్ళ వ్యాపారం చేసి కొన్నాం కదా! ఒక రూము శుభ్రంగా ఫర్నిచర్‌ చేయించి అందులో ఉంటున్నాం.
శేషు: మరి తొమ్మిది గదుల్లో?
వాసు: వాటిల్లో కోళ్ళుంటున్నాయి.

First Published:  21 Sep 2015 1:03 PM GMT
Next Story