Telugu Global
Cinema & Entertainment

క‌మ‌ల్ హాస‌న్ ను బుక్ చేశారు..!

మ‌నిషికో   యాటిట్యూడ్ ఉంటుంది. ఏ ఇద్ద‌రిది  వంద శాతం క‌ల‌వ‌దు.  సెల‌బ్రిటి స్టేట‌స్ అనేది   ఒక బిజినెస్ ఎలిమెంట్.  వాడుకోవాల‌నుకుంటే. .క‌మ‌ల్ హాస‌న్ లాంటి  ఇంట‌ర్నేష‌న‌ల్  స్టార్ కు  ఏ రేంజ్ లో   వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు చేసే అవ‌కాశం వ‌స్తుందో ఊహించవ‌చ్చు. కానీ. సుదీర్ఘ‌మైన నట జీవితం వున్న క‌మ‌ల్ హాస‌న్ ఇంత వర‌కు ఒక్క  వాణిజ్య ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.  ఎందుకు అంటే ..   ఈ విష‌యం ప‌ట్ల ఆయ‌న స్టాండ్ ఏమిటి అని మీడియా వాళ్లు […]

క‌మ‌ల్ హాస‌న్ ను బుక్ చేశారు..!
X

మ‌నిషికో యాటిట్యూడ్ ఉంటుంది. ఏ ఇద్ద‌రిది వంద శాతం క‌ల‌వ‌దు. సెల‌బ్రిటి స్టేట‌స్ అనేది ఒక బిజినెస్ ఎలిమెంట్. వాడుకోవాల‌నుకుంటే. .క‌మ‌ల్ హాస‌న్ లాంటి ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్ కు ఏ రేంజ్ లో వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు చేసే అవ‌కాశం వ‌స్తుందో ఊహించవ‌చ్చు. కానీ. సుదీర్ఘ‌మైన నట జీవితం వున్న క‌మ‌ల్ హాస‌న్ ఇంత వర‌కు ఒక్క వాణిజ్య ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఎందుకు అంటే .. ఈ విష‌యం ప‌ట్ల ఆయ‌న స్టాండ్ ఏమిటి అని మీడియా వాళ్లు అడిగింది లేదు. ఆయ‌న చెప్పింది లేదు.

ఇక అస‌లు విష‌యం ఏమిటంటే లోక‌నాయ‌కుడు మొట్ట మొద‌టి సారి ఒక వాణిజ్య ప్ర‌క‌ట‌న చేస్తున్నార‌ట‌. చెన్నైకు చెందిన పోతేస్ వ‌స్త్రాల‌కు క‌మ‌ల్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా చేస్తున్నార‌ట‌. ప్ర‌ముఖ ఫోటోగ్రాఫ‌ర్ కృష్ణ ఈ యాడ్ ను రూపొందిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు శృతిహాస‌న్ ఈ పోతిస్ సంస్థ‌కు బ్రాండ్ అంబాసీడ‌ర్ గా చేశారు. సంప్రాదాయ వ‌స్త్రాల‌కు పోతిస్ పెట్టింది పేరనే విష‌యం ద‌క్షిణాదిన తెలిసిన విష‌య‌మే. ఏది ఏమైన మ‌న లోకనాయ‌కుడు క‌మ‌ల్ మొట్టమొద‌టి సారిగా ఒక వాణిజ్య ప్ర‌క‌ట‌న చేయ‌డం విశేష‌మే క‌దా.! మ‌రి ఏ లుక్ లో క‌నిపిస్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ.!

First Published:  22 Sep 2015 8:30 AM GMT
Next Story