Telugu Global
Cinema & Entertainment

వెంకీతో కాదు.. అక్కినేని హీరోతో..

భలే భలే మగాడివోయ్ సినిమా సక్సెస్ తర్వాత హీరో వెంకటేశ్ తో మారుతి ఓ సినిమా చేస్తాడని అంతా అనుకున్నారు. నిజానికి గతంలోనే వెంకీతో కలిసి రాధ అనే సినిమా స్టార్ట్ చేయాల్సింది మారుతి. కానీ అప్పుడు ఆ ఛాన్స్ మిస్సయింది. తాజాగా ఇప్పుడు కూడా మరోసారి  ఆ ఛాన్స్ మారుతి చేజారిపోయింది. తాజా సమాచారం ప్రకారం మారుతి నెక్ట్స్ సినిమా అక్కినేని కాంపౌండ్ లో ఉంటుంది. కథ సిద్ధమైంది. హీరో ఎవరనేది నాగార్జున డిసైడ్ చేస్తాడు. […]

వెంకీతో కాదు.. అక్కినేని హీరోతో..
X
భలే భలే మగాడివోయ్ సినిమా సక్సెస్ తర్వాత హీరో వెంకటేశ్ తో మారుతి ఓ సినిమా చేస్తాడని అంతా అనుకున్నారు. నిజానికి గతంలోనే వెంకీతో కలిసి రాధ అనే సినిమా స్టార్ట్ చేయాల్సింది మారుతి. కానీ అప్పుడు ఆ ఛాన్స్ మిస్సయింది. తాజాగా ఇప్పుడు కూడా మరోసారి ఆ ఛాన్స్ మారుతి చేజారిపోయింది. తాజా సమాచారం ప్రకారం మారుతి నెక్ట్స్ సినిమా అక్కినేని కాంపౌండ్ లో ఉంటుంది. కథ సిద్ధమైంది. హీరో ఎవరనేది నాగార్జున డిసైడ్ చేస్తాడు. మాంఛి యూత్ ఫుల్ ఎంటర్ టైనింగ్ కథను రాసుకున్నాడట మారుతి. ఈ స్టోరీని నాగార్జునకు వినిపించాడు. సినిమాలో కాస్త విలక్షణత కూడా ఉంది. కాబట్టి ఈ స్టోరీనే తనే చేయాలని భావిస్తున్నాడు నాగ్. మరోవైపు నాగచైతన్య, అఖిల్ లో ఒకరు చేసినా బాగుంటుందని భావిస్తున్నాడు. అఖిల్ సినిమా విడుదలైన వెంటనే మారుతి కథపై ఓ నిర్ణయం తీసుకుంటాడు నాగార్జున.
First Published:  21 Sep 2015 7:12 PM GMT
Next Story