Telugu Global
Cinema & Entertainment

కొరటాలతో మాస్ రాజా..?

అన్నీ అనుకున్నట్టు జరిగితే శ్రీమంతుడు దర్శకుడు కొరటాల శివ, త్వరలోనే మాస్ రాజా రవితేజతో కలిసి సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీమంతుడు బిగ్ సక్సెస్ తర్వాత కొరటాలకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి కొరటాల ఓ సినిమా చేసే ఛాన్స్ ఉందని అంతా భావించారు. మరోవైపు మెగాహీరోలు కొంతమంది కొరటాల కోసం ప్రయత్నించారని కూడా తెలిసింది. కానీ కొరటాల మాత్రం రవితేజకు ఫిక్స్ అయినట్టు సమాచారం. రవితేజ బాడీలాంగ్వేజ్ […]

కొరటాలతో మాస్ రాజా..?
X
అన్నీ అనుకున్నట్టు జరిగితే శ్రీమంతుడు దర్శకుడు కొరటాల శివ, త్వరలోనే మాస్ రాజా రవితేజతో కలిసి సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీమంతుడు బిగ్ సక్సెస్ తర్వాత కొరటాలకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి కొరటాల ఓ సినిమా చేసే ఛాన్స్ ఉందని అంతా భావించారు. మరోవైపు మెగాహీరోలు కొంతమంది కొరటాల కోసం ప్రయత్నించారని కూడా తెలిసింది. కానీ కొరటాల మాత్రం రవితేజకు ఫిక్స్ అయినట్టు సమాచారం. రవితేజ బాడీలాంగ్వేజ్ కు తగ్గ కథను కొరటాల శివ ఇప్పటికే సిద్ధం చేసుకున్నాడట. దీనిపై ఇంకా ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాలేదు. కొరటాల నెక్ట్స్ సినిమా ఏ హీరోతో చేసినప్పటికీ.. ఆ సినిమా మాత్రం మైత్రీ మూవీస్ బ్యానర్ పైనే ఉంటుంది. ఈ మేరకు ఒప్పందం జరిగిపోయింది. ఈ సంస్థే.. ప్రస్తుతం మాస్ రాజాతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. శ్రీమంతుడు తర్వాత కొరటాల ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే విషయం వచ్చేనెలలో తేలిపోతుంది.
First Published:  21 Sep 2015 8:15 PM GMT
Next Story