Telugu Global
Others

యువశక్తితోనే లక్ష్యాల సాధన సాధ్యం

విశాఖ యువభేరీలో వైసీపీ నేత జగన్‌ పిలుపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలను విస్మరించాయని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన విశాఖలోని కళావని పోర్టు స్టేడియంలో ఆంధ్రా విశ్వవిద్యాలయం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను వంచిస్తున్నాయని, రుణమాఫీ, ఉద్యోగాల ప్రకటన, నిరుద్యోగ భృతి వంటి హామీలన్నీ గాల్లో కలిసిపోయాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కన్నా సొంత మనుషుల అభివృద్ధి చంద్రబాబు […]

యువశక్తితోనే లక్ష్యాల సాధన సాధ్యం
X

విశాఖ యువభేరీలో వైసీపీ నేత జగన్‌ పిలుపు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలను విస్మరించాయని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన విశాఖలోని కళావని పోర్టు స్టేడియంలో ఆంధ్రా విశ్వవిద్యాలయం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను వంచిస్తున్నాయని, రుణమాఫీ, ఉద్యోగాల ప్రకటన, నిరుద్యోగ భృతి వంటి హామీలన్నీ గాల్లో కలిసిపోయాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కన్నా సొంత మనుషుల అభివృద్ధి చంద్రబాబు ఎజెండాగా ఉందని ఆయన ఆరోపించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టిన నేతలే ఇపుడు ఆ ఊసు ఎత్తితే అదేదో బూతు పదంలా భావిస్తున్నారని, హోదా ఐదేళ్ళు కాదు పదేళ్ళు కావాలని అడిగిన వారు ఇపుడు నోరు మెదపడం లేదని జగన్‌ ఆరోపించారు. ప్రత్యేక హోదా అభివృద్ధికి సంజీవిని వంటిదని, రాష్ట్రంలో ఉన్న చాలా సమస్యలు హోదా వల్ల తీరతాయని ఆయన అన్నారు. ఈ నాయకుల చేతకానితనం వల్ల యువత నష్టపోతుందని, పెద్ద ఎత్తున యువత కదిలితేనే ప్రత్యేక హోదా సాధన సాధ్యమవుతుందని జగన్‌ పిలుపు ఇచ్చారు.
ఎంతోకాలం నుంచి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇంతవరకు తీపి కబురు రాలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనలతోనే కాలమంతా గడిచిపోతుందని ఆయన అన్నారు. కోటి మంది నిరుద్యోగులున్నారని, లక్షా 42 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేయాలన్న థ్యాస ఈ ప్రభుత్వానికి లేదని జగన్‌ ఆరోపించారు. యూనివర్శిటీల్లో టీచింగ్‌ స్టాఫ్‌లేక విద్యార్థులు చదువుల్లో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రయివేటు విశ్వవిద్యాలయాలకు పెద్దపీట వేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం యూనివర్శిటీలను నిర్వీర్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. అనంతరం విశాఖలో జరిగిన యువభేరీ సభలో ఆయన మాట్లాడారు.
ప్రత్యేక హోదా గురించి తాను పలుమార్లు ధర్నాలు చేశానని, దానిపై అవగాహన కల్పించడానికి యత్నించామని అన్నారు. కాని ప్రత్యేక హోదా గురించి తెలిసినా మభ్య పెట్టే యత్నం చేస్తున్నారని అన్నారు. మంత్రులకు ప్రత్యేక హోదా అంటే ఏమిటో తెలియని దారుణ పరిస్థితి ఉందని జగన్ అన్నారు. ఏ పరిస్థితిలో ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందో గుర్తు చేసుకోవాలని అన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించే ముందు, హైదరాబాద్ వేరు అవుతోందని, అందువల్ల జరిగే నష్టాన్ని పూడ్చడానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అనుకున్నారని జగన్ తెలిపారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని, ఆ సమయంలోనే ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించిందని జగన్‌ గుర్తు చేశారు. హైదరాబాద్‌ తెలంగాణకు వెళ్ళిపోయిన కారణంగా ఏపీకి వాటిల్లే నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారని, కానీ ఇపుడు అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అది ఇవ్వాలన్న థ్యాసగాని, తెచ్చుకోవాలన్న ఆరాటంగాని లేవని జగన్‌ విమర్శించారు. ఎన్నికల ముందు ఏ టీవీ చూసినా బాబు వస్తే రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణ మాఫీ, జాబులు వస్తాయని ప్రచారం జరిగేదని, కాని ఇప్పుడు పరిస్థితి చూస్తే అంతా వ్యతిరేకంగానే ఉందని విపక్ష నేత జగన్ వ్యాఖ్యానించారు.

First Published:  22 Sep 2015 2:29 AM GMT
Next Story