Telugu Global
Others

ఏపీకి నిలిచిపోయిన రూ. 836 కోట్ల యూజీసీ నిధులు

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నిర్దేశించిన ప్రమాణాలు పాటించనందుకు ఆంధ్రప్రదేశ్‌లోని వర్సిటీలకు రావాల్సిన నిధులు ఆగిపోయాయి. గత ఏడాది గణాంకాల ప్రకారం… రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీలకు 12వ ప్రణాళిక గ్రాంట్‌ కింద కేటాయించిన రూ.983 కోట్లలో ఇప్పటి వరకు రూ.147 కోట్లను మాత్రమే యూజీసీ విడుదల చేసింది. అంటే రూ.836 కోట్లను బ్లాక్‌ చేసింది. ఖాళీగా ఉన్న 1100పైగా టీచింగ్‌ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయకపోవడం వల్లే యూజీసీ నిధులు నిలిచిపోయాయి. విద్యార్థుల సంఖ్యకు, అవసరాలకు తగిన […]

ఏపీకి నిలిచిపోయిన రూ. 836 కోట్ల యూజీసీ నిధులు
X
యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నిర్దేశించిన ప్రమాణాలు పాటించనందుకు ఆంధ్రప్రదేశ్‌లోని వర్సిటీలకు రావాల్సిన నిధులు ఆగిపోయాయి. గత ఏడాది గణాంకాల ప్రకారం… రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీలకు 12వ ప్రణాళిక గ్రాంట్‌ కింద కేటాయించిన రూ.983 కోట్లలో ఇప్పటి వరకు రూ.147 కోట్లను మాత్రమే యూజీసీ విడుదల చేసింది. అంటే రూ.836 కోట్లను బ్లాక్‌ చేసింది. ఖాళీగా ఉన్న 1100పైగా టీచింగ్‌ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయకపోవడం వల్లే యూజీసీ నిధులు నిలిచిపోయాయి. విద్యార్థుల సంఖ్యకు, అవసరాలకు తగిన రీతిలో ఫ్యాకల్టీ లేకుంటే బోధన వ్యవస్థ కుంటుపడుతుందని.. ఈ ప్రభావం ఉన్నత విద్యలో ప్రమాణాల పతనానికి దారితీస్తోందని యూజీసీ భావిస్తోంది. నిర్దేశిత మార్గదర్శకాలను పాటించిన వర్సిటీలకు మాత్రమే యూజీసీ నిధులు విడుదల చేస్తుంది. అధ్యాపకుల భర్తీపై తొమ్మిది నెలల క్రితమే యూజీసీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించినా సరైన స్పందన లేకపోవడంతో నిధులను నిలిపివేసినట్టు తెలుస్తోంది.
First Published:  22 Sep 2015 9:23 PM GMT
Next Story